republic day

republicdayintelugu.jpg

Thursday, 22 March 2012

యాగాలు చేస్తే ..........వస్తుందా!?

K C R  గారు  తెలంగాణ  రాష్ట్రం  కోసం  ఎపుడు  పడితే  అప్పుడు "యాగాలు" చేయిస్త్తుంటారు..
 యాగాలు చేస్తే  రాష్ట్రల్లోస్తాయా?!!! (మంత్రాలకు  చింతకాయలు రాలతాయా)


          గాంధీ గారు  యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చారా?
          రష్యన్ విప్లవం యాగాలతో వచ్చిందా!
          జార్జ్ వాషింగ్టన్ యాగాలతో  అమెరికాకు independence తెచ్చాడా!!


K C R అంటే   కాదు,  చెయ్యలేడు,  రాదు! అని చెప్పుకోవలసి వస్తుందేమో!
  ఎందుకంటే గత పదేండ్ల నుండి మనము గమనించినట్లయితే ,ఆయనకు  తెలంగాణా  రాష్ట్రవతరణము  మీద     ఇంటరెస్ట లేదోమో అనిపిస్తుంది.ఏదో ఎలక్షన్లప్పుడో,తెలంగాణా ప్రజలు తనను మరచిపోతునారేమో అని                     అనిపించినపుడో  అలా ప్రజల్లోకొచ్చి,బూతులతోకూడిన  ఉపన్యసాలివ్వడము,ప్రజలను రెచ్చకొట్టడము తప్ప  రాష్ట్ర   సాధన కోసం ఈ దశాబ్ద కాలంలో అయన చేసింది ఏమీ లేదు.
 ఈ దశాబ్ద కాలంలో ఒరిగిందేమైనఉందంటే-1.తెలంగాణ భవన నిర్మితం  
                                                             2. కూతురికి తెరాస లో పదవి
                                                              3 .కుమారునికి  MLA   పదవి
                                                              4.  మేనల్లుడికి  MLA  పదవి
                                                              5 .తన ఆస్తుల  పెరుగుదల
ఇవన్ని పచ్చి నిజాలు,నిస్టుర సత్యాలు.ఈ ఉద్యమము ప్రారంభమునుండి   ఇప్పటివరకు ఏ లాభము పొందని (ఈ ఉద్యమము ద్వారా)ఎంతోమంది అమాయకులు, అమాయక విద్యార్థులు ప్రాణ త్యాగం చేసారు. వారికి ఒరిగిందేమిటి?కేవలం వారి ఫోటోలకు పూలదండలు తప్పితే?
         గొప్పలు చెప్పుకొనే  ఈ తెరాస నాయకులు అందరు ప్రాణాలర్పించిన
వారి కుటుంబాలకు చేసిన మేలేమిటి? "తమబిడ్డలు చదువుకొని అభివ్రుద్దికొచ్చి తమ కస్టాలు తీర్చి తమ జీవితాలనుబాగుపరుస్తారులే అని కళలు కన్న ఆ పేద ,అమాయకుల తల్లిదండ్రుల ఆవేదనను తీర్చేదెవరు?" ఇన్నిసార్లు ఉపఎన్నికలోచ్చాయికదా! ఒక్క నాయకుడైన ఆ త్యాగధనుల తల్లిదండ్రులకుగాని బంధువులకుగాని "టిక్కెట్లిచ్చారా?
       నాయకులందరూ  సత్తాలేని  రాజీనామాలిచ్చి త్యాగం చేసాం త్యాగం చేసాం అంటున్నారు. ఏంటి వీరి త్యాగం.
నా దృష్టిలో త్యాగం అంటే -రా.నా ఇచ్చినవాళ్ళు తెలంగాణా సాధించేవరకు మల్లీపోటీ చేయకూడదు.ఏ రాజకీయ పదవి స్వీకరించకూడదు.
ఇక KC R గారి  తె. రా.సాధనపట్ల గల చిత్తశుద్దిని శంకించ వలసి వస్తోంది. ఎందుకంటే గత పదేండ్లలో జరిగినఉద్యమాలలో ఆయన ఏరోజు ముందుండి LEAD  చేసిన దాఖలాల్లు లేవు. నాయకుడంటే  ఏలే వుండాలి?
సచ్చీలత కలిగి, ఏ దురలవాట్లులేకుండా  ప్రతిక్షణం ప్రజలకోసం పరితపించేవాడై ఉండాలి.అన్నీ తానే అయి ముందుండి నడిపించాలి.కాని  మన KCR  ఎక్కడుంటాడో తెలియదు .ఉద్యమము భయంకరంగా సాగుతుంటుంది.కాని ఈయన DELHI లో ప్రత్యక్షమవుతాడు. అక్కడ కెందుకెల్లాడో ఎవరికి తెలియదు.తనూ చెప్పడు.
       అసలు మొన్న జరిగిన సకల జనుల సమ్మె ఏంతో ఉదృతంగా జరుగుతూ ఉండింది. ఇంకో పది రోజులో,పదిహేను రోజులో జరిగితే ఖచ్చితంగా కేంద్రము దిగివస్తుంది లే అని అందరూ అనుకుంటున్న సమయం లో తుస్సుమనిపించేసారు. అసలు ఎవర్ని అడిగి సమ్మెను విరమించుకున్నారో ఆ చతుష్టయమునకే తెలియాలి.
      ఇంకొక విషయమేమంటే కెసిఆర్ గారు చెప్పే ఇంకో సులభమైన మాట-ఏ  పండగైన రానివ్వండి,"ఈ పండుగనుNEXTYEAR "తెలంగాణా రాష్ట్రంలో" జరుపుకుంటామని. ఇలా అన్ని అబద్దాలు చెప్తూ ,అమాయకులైన తెలంగాణాప్రజలను మోసం చేయడమే ,దగా చేయడమే ,వంచన చేయడమే అయన వ్రుత్తి,ప్రవ్రుత్తి.
     తెలంగాణా అనే విషయం కేంద్రం చేతిలో ఉందని ,ఇటలి ఇడియట్  "హస్తం"లో ఉందని చిన్న పిల్లోడికి కూడాతెలుసనే విషయం KCR కు కూడా తెలియందేమికాదు. అయినప్పటికీ అయన తెలుగు వారిని, తెలంగాణ వాదులను,జన్మతః తెలంగాణ వారిని(వారు తెరాస వారు కాకపోతే) తిడతాడు,తిట్టిస్తాడు,కొట్టిస్తాడు.కాని ఎవరిచేతిలోతెలంగాణా వుందో వారిని ఒక్క మాటకూడా అనడు. మరి ఇటలి హ్యాండ్ అంటే భయమో ఏమో తెలియదు. డైరెక్ట్గ గా-మేము తెలంగాణాకు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ మరీ చేబుతిన్న MIM ఒవైసీ వారిని కూడా ఏమీ  అనలేడు.మరి వారంటే సారుకు మరీ మరీ భయమేమో!
      కెసిఆర్ గారు  మీరు ఇప్పుడైనా చిత్తశుద్దితో తెలంగాణా వాదులందరినీ కలుపుకొని పోరాటము చేయండి.అభం శుభం తెలియని అమాయకులైన తెలంగాణా ప్రజానీకాన్ని ఇంకా మోసం చేయకండి!     యాగాలు,కుట్రలు,కుతంత్రాలు చేస్తేనో,బూతులు తిడితెనో,ప్రజలను భయపడిస్తేనో, విగ్రహాలను పడేస్తేనో తెలంగాణ
రాదు. మరొకసారి  మన జాతిపిత గాంధీ గారి జీవిత చరిత్రను క్షుణంగా చదవండి.ఆ మహానుభావుడి మార్గాన్ని అనుసరించండి.!
    వ్యూయర్స్/రీడర్స్ ! ఇది ఎవర్ని నొప్పించాలని  రాయలేదు. ఉన్నవాస్తవ పరిస్తితులను  ఉటంకించాను.

6 comments:

 1. హరి చాలాబాగా విశ్లేషించావు
  కాని ఒక విషయం హరి
  చూసావా నీకు తెలియకుండానే కెసిఆర్ ని
  మహానుభావులతో పోల్చేసావు అతనికి అంత అర్హత లేదు
  ఫామిలి డెవెలప్మెంట్ ప్రోగ్రాం పెట్టుకుని వుద్యమం లోకి వచ్చినవాడు
  ఎలా వుండాలో అలానే వున్నాడు

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ శ్రీను.శ్రీను నేను మహానుభావులతో పోల్చలేదు. ఓ ఉద్యమము ఎలా నడపాలో గాంధీ గారి జీవిత చరిత్ర చదివి తెలుసుకో అని
   నైస్ గా మందలించాను.అయిన ఐలాంటి వెధవల్ను ఎవరైనా అంట గొప్పవారితో పోలుస్తారా? పోల్చరు గాక పోల్చరు.

   thanq for nice criticism.

   Delete
 2. మొలకి చిన్న గావంచా చుట్టుకొని, నిటారుగా వింటి బద్దలా నిల్చొని, చిరునవ్వుతో, చేతి రెండువేళ్లతో జనాన్ని శాశిస్తున్న ఆ ముసలాడి విగ్రహం యెక్కడా చూడలేదే! (కళ్లకి ఆజోడూ, బొడ్లో గడియారమోటీ!). యెక్కడ సంపాదించావయ్యాబాబూ ఆ ఫోటోని?!

  ఏకుడు బాగానే సాగుతోంది.

  కీపిటప్!

  ReplyDelete
 3. అంతర్జాలములొ గాంధీ గారి జీవితచరిత్ర నుండి తీసుకున్నాను. thanks for encouragement.

  ReplyDelete
 4. parshu ram గారు,ధన్యవాదాలు అండి, మీ స్పందనకి.

  ReplyDelete