republic day

republicdayintelugu.jpg

Sunday 17 March 2013

.......ఇది సాధ్యమా......?

     ఈరోజు  'The Hindu' పేపర్ చదువుతూ ఉంటే  "holding quote" కనపడింది. అందులో Author 'Anuja Chouhan ' గారి quote- anti-rape law మీద- "WHY CAN'T MEN STAY INDOORS AFTER 8 PM TO STOP RAPE"

ఈ QUOTE చదివిన తరువాత  ఈ పోస్ట్ రాయాలనిపించింది. IS IT  POSSIBLE?  ఇది సాధ్యమా? అదీ మన భారతదేశంలో.మన దేశంలో అధిక శాతం/ మెజారిటీ శాతం ఉద్యగాలు చేసేది  పురుషులే! కుటుంబ పోషకులు వారే!
పితృ  స్వామ్యమున్న మనదేశం లో ఇది సాధ్యమా? అసలు  ఆ  ఊహే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
     
          ఏ రంగం తీసుకున్న అత్యధిక శాతం పురుషులే ఉద్యోగం చేస్తుంటారు.అలా ఉద్యోగం చేసే వారిలో -SHIFT SYSTEM లో పని చేసేవారు, NIGHT DUTY  కి  వెళ్ళేవారు, SHIFT DUTY  చేసుకొని ఇంటికి వెళ్ళేవారు- ఇలా ప్రతి రంగం లో పురుషులు పగలనక రాత్రిల్లనక  రాకపోకలు  సాగిస్తూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ  ఎక్కడికక్కడే ఆగిపోతే -జీవితం సాగేదేలా? అసలు అది సాధ్యమా? ఒకవేళ అలాగే  INDOORS లో ఉండిపోవాలే అనుకుందాం-DUTY HOURS అయిపోయిన తరువాత ఆ ఆ సంస్థలు వారిని అక్కడే ఎందుకు ఉండనిస్తాయి.
అలాగే షాప్స్ లో పని చేసే  పురుషుల పరిస్తితి ఏంటి? దాదాపు అన్ని షాప్ లు  రాత్రి పది గంటలకు క్లోజ్ చేస్తారు. మరి వారు ఎక్కడ ఉంటారు? ఎప్పుడో ఉదయం 9 గంటలకు షాప్ ల కొచ్చి  షాప్ లు క్లోజ్ చేసిన తరువాత  వారు
ఇంటికి పోకపోతే వారి FAMILY పరిస్తితి  ఏంటి?

           ఇక ఇంకొక ఉదాహరణ -సినిమాలు , సినిమా హాల్ల  విషయమేంటి-దాదాపు అన్ని SECOND SHOWSకు పోయే వాళ్ళంతా పురుషులే .మరి పురుషులందరూ ఎనిమిది తరువాత  INDOORS లో ఉంటే మరి వాటి పరిస్థితి ఏంటి. FIRST SHOW 9 గంటలు వదులుతారు .మరి 8 దాటి పోయింది  కాబట్టి వాళ్ళందరూ హాలు లోనేఉండిపోవలేనా? అసలు అది సాధ్యమా!

           మరొక చిన్న విషయము - FOUR WHEELER  ఉండే చాలా మంది యజమానులు DRIVERS ని   డ్యూటీ లో పెట్టుకుంటారు. అలా DRIVERS గా ఉద్యోగము చేసేవారందరూ పురుషులే. వారు జమానులను  అవసరాన్ని బట్టి  ఏ సమయములో నైనను తీసుకురావడమో,తీసుకుపోవడమో జరుగుతుంది. మరి ఆ  DRIVERS ని
డ్యూటీ కి పోకుండా ఆపగలమా? పోనీ  పురుష చ్యోదకులే లేకుండా చేద్దామనుకున్దాము. మరి స్త్రీలు  ఆ DRIVERS డ్యూటీ చేయగలరా. OKAY  చేస్తారు అనుకుందాము. ఐతే అది వారికి  COMFORTABLE జాబా? అక్కడ వారికి SAFETY AND SECURITY ఉంటుందా? ALMOST ALL యజమానులందరూ  పురుషులే కదా!
 
     ఇలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూపోతే -IT IS IMPOSSIBLE ,I  THINK. ఒకవేళ  అలా జరగాలంటే -అది జీవన ప్రక్రియనే ఆపేస్తుందేమో! THERE WILL BE STANDSTILL IN THE HUMAN LIFE.

     అంత పెద్ద రచయిత గారు  అలా QUOTE  చేయడం  సబబు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే-ఇక్కడ  ఎవరుబయట ఉండాలి ,ఎవరు  లోపల ఉండాలి  అనేది కాదు POINT.  స్త్రీలపై  పురుషుల  దృక్పధం మారాలి. స్త్రీలను  గౌరవించడం రావాలి. అది ఇంటి నుండే రావాలి. చిన్నతనము లోనే  అబ్బాయిలకు  FEMININE GENDER ఫైగౌరవ మర్యాదలు  ఉండేట్లు నేర్పాలి.GIRLS  అంటే ఆటవస్తువులు ,SEXY SYMBOLS  కాదని ,వారిని
గౌరవించటం,మర్యాదించడం  వారికి తెలియ చెప్పటం లాంటివి  ఇంటిలో నుండే మొదలవ్వాలి.అలాగనే  స్త్రీలు కూడా  ఇంట్లో  తమ కూతుర్లకి   మన సంస్కృతి, సాంప్రదాయాలని , వాటి గొప్ప తనాలని  చెబుతూ గౌరవాన్ని ఇనుమడింపజేసే , శరీరాన్ని COVER చేస్తూ ఉండే, మనకు సేఫ్టీ కలిగించే డ్రెస్ లను ధరించడం  మంచిదని వారికి నచ్చచెప్పటం  లాంటివి చేయాలి. బట్టలు హుందాగా ధరించటం (EVEN MODERN DRESSES) ఎలాగో వారికి తెలియ చెప్పాలి. ఎందుకంటే ,పంజాబీ డ్రెస్ వేసుకున్న చాలామంది అమ్మాయిలని OBSERVE  చేస్తే -వారికి చున్ని ఉంటుంది ,సంతోషమే ,కాని  అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండ గొంతుకు అతుక్కుని ఉంటుంది. అదే బాధ. ఇలా ప్రతి ఒక్కరు -ఎవెరి డ్యూటీ వారు చేస్తే  కొంతైన అత్యాచారాలను  అరికట్టవచ్చునెమో!

    ఇక ప్రభుత్వ పరంగా చూస్తె -RAPIST లకు త్వరగా శిక్ష పడేట్లు చూడాలి. అది ఏ  శిక్ష అయినను, అంటేమరణ శిక్ష గాని లేక జీవిత ఖైదు కాని. మరి మీరేమంటారు?

Saturday 23 February 2013

ఇంకెన్నాళ్ళు ఈ నర.......

.............దీనికి  FULL STOP  లేదా?
                                        ఆపలేమా?
                  మరీ అంత చేతకాని వాళ్ళమా?
                                          దద్దమ్మలమా?
              అమాయకులు  బలికావలసిందేనా?
        అలాగయితే, ఎందుకీ మంది మార్భలం?           
ఓ పెద్ద  REPUBLICAN DEMOCRATIC COUNTRY. ప్రపంచంలోనే  అతిపెద్ద  సైన్యం కల్గిన దేశం.   
 ఓ  POWERFUL  DEVELOPING COUNTRY. అయినా ఈ నరమేదాన్ని ఆపలేకపోతున్నాము.

          అమెరికా లో  ఆ ఒక్క దాడి  తప్ప ,మరొకటి జరుగ లేదు. అది రక్షణ వ్యవస్థ అంటే. వారు నిజమైన రక్షకులు -పౌరులకి.
మనకూ ఉన్నారు-ఎలాంటి వాళ్ళంటే-
ఒకరంటారు, ఇంతపెద్ద  సువిశాల  దేశంలో ఎక్కడో ఒకచోట అరాచకం జరిగితే ,దానిని ఆపటం కష్టమని/సాధ్యం కాదని. (ఈయన తనకున్న ఒకే ఒక్క QUALIFICATION తో దేశాన్ని ఏలాలని కలలు కంటా వుంటారు) 

ఇంకొక మేడం అంటారు -డిల్లి లాంటి  నగరం లో అరాచకాలను  కట్టడి  చేయలేమని.ఈవిడ గారు  డిల్లి  CM.

ఇంకొక సారంటారు-మూడ్రోజుల ముందే  INFORMATION  ఇచ్చామని.

మన సారంటారు- అవి సాధారణ  హెచ్చరికలే అనుకున్నామని. ఇది మనపాలకుల భాగోతం.
                
                అరె జనాల ప్రాణాలకు  సంబందిన్చినది. అదియును గాక  కసబ్ను మరియు  గురును  ఉరి తీసి కొద్ది రోజులే అయింది. ఇలాంటి పరిస్తితులల్లో  సాధారణ  హెచ్చరిక  అని ఎలా  అనుకుంటారో నాకు  అర్థం  కావడం లేదు. అంటే పౌరుల ప్రాణాలంటే వీరికి లెక్కలేదు.

 పాలకులు ప్రజల మాన ధన ప్రాణాలకు  రక్షణ కల్పించాలి,రక్షకులుగా ఉండాలి. అంతే కానీ చేయలేము, సాద్యం కాదు, మామూలు హేచ్చారికే అనుకున్నాము  అంటూ ప్రజల్లో  భయాందోళనలు, గంధర గోలాలు  కలుగ చేయకూడదు.
                  మాఖియవెల్లి  అన్నట్లు, చేయలేకపోయిన చేస్తామ్మన్నట్లు ప్రజల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపాలి  కాని అలా అందోళనలకు గురిచేయకూడదు కదా!

   ఇంకా ఎంతమంది  అమాయకులు  మరణిస్తే  మన నాయకులకు కనువిప్పు కలుగుతుంది. అలా కలిగి ఈ నరమేదాన్ని ఎప్పుడు ఆపుతారు . అసలు ఆపగలరా అని సగటు భారతీయుని  సందేహం.
           
           ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకుని మన నాయకులు -పకడ్బంది వ్యూహంతో ప్రపంచం లో  పాకిస్తాన్ ను ఏకాకిని చేయడం.దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన కాపలాతో ముష్కురులను  దేశంలోకి చొరబడకుండా  చూడడం,దొరికిన ముష్కురులను న్యాయము, చట్టము  అంటూ కాలయాపన  చేయకుండా తక్షణమే శిక్షించటం,అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ,ప్రజా సమూహాల కూడలిలో ,RAILWAY STATION,BUS STAND లలో-
లేని చోట్ల C C  కెమెరాలను  అమర్చటం, ఉన్నవాటిని  PERFECT   గా      PERFORM చేయించటం,ప్రతివొక విషయంలో PHOTO  ID  CARD ని  కంపుల్సరి చేయడం ,ఏ విషయం లోను రాజీ పడక నిజాయితిగా  వ్యవహరించడం ద్వారా కొద్దిలో కొద్దిగైన  ఈ నరమేదాన్ని ఆపు తారని  ఆశిద్దాం.

     అలాగే పౌరులమైన మనము మన వంతు  కర్తవ్యాన్ని  పాటిద్దాం! ఎలాగంటే-
             ముక్కు మొఖం తెలియని  కొత్తవారికి గదులు ఇల్లులు రెంటుకివ్వక పోవడం
             ఒకవేళ ఇస్తే  TENANTS  PARTICULARS/INFORMATION ను దగ్గర గల పోలీస్ స్టేషన్ లో  ఇవ్వటం. అలాగే LODGES వారు కూడా  .PS లలో INFORMATION ఇవ్వటం.పరిసర ప్రాంతాలను గమనిస్తూ  ACTIVE గా ఉండడం.
        
చివరిగా -గోకుల్ చాట్, లుంబిని పార్క్ తదితర బ్లాస్టులు మరియు 21 న జరిగిన బ్లాస్టులను చూసి బాధ పడుతూ పెట్టిన పోస్ట్ ఇది.(మీరూ బాధ పడి ఉంటారు. ఆ మాటకొస్తే మనందరమూ  భాధ పడుతూనే ఉన్నాము) అంతే కాని ఎరిని నొప్పించాలని కాదు. అలా ఎవరినయిన నొప్పించి ఉంటె క్షంతవ్యుణ్ణి.

                                       జై భారత్! జై భారత్!! జై జై భారత్!!!

-  

Friday 25 January 2013

My DRESS is not A YES

YES, certainly not A YES
Who said it is A YES.

'నిర్భయ ' సంఘటన జరిగిన తరువాత,  ఢిల్లీలో పెల్లుభికిన యువజన నిరసనలో కనపడిన ఓ  placard లోని  slo GUN అది.
 MY DRESS IS NOT A YES-
WHAT AN EXPRESSION
THOUGHT PROVOKING sloGUN
AN EXCELLENT IDEA

                     ఈ స్లో గన్ కనిపెట్టిన వారికి జోహార్లు.
ఈ మగాల్లపై (మృగాల్లపై)  సంధించిన సుతిమెత్తని గన్నది, బాణమది,హెచ్చరికది.    
                   YES, definitely your dress is not a yes.  YES అని ఎవరూ అనరు. అనడానికి ఆస్కారమే లేదు.
అయితే!  దాదాపు నూటపాతిక కోట్ల జనాభా ఉన్న సువిశాల ఈ భారతదేశంలో, పురుషాధిక్య, పురుషాహంకార ఈ భారతదేశంలో, స్త్రీని ఓ మాతగా, ఓ శక్తి గా చూడవలసి ఉండినను, ఓ ఆటవస్తువుగా  చూస్తున్న ఈ భారత దేశంలో అందరూ మంచివాల్లే ఉండరు తల్లీ! (అలా ఉండాలని ఊహించటం/ఆశించటం అత్యాశే అవుతుంది తల్లీ!) 
         కీచకులు, పోకరీల్లు , రాబందులు, వెధవలు , మృగాల్లు కూడా  ఉంటారు తల్లీ! అందుకనే  మన జాగ్రత్తలో మనముండాలి  తల్లీ! (ఉండకపోతే రేప్ చేస్తారా, చంపేస్తారా,దౌర్జన్యం చేస్తారా ! అని అనకండి) I am not supporting. Just I am discussing the consequences- మన పెద్దలు చెప్పినట్లు, "చేతులు  కాలాక  ఆకులు పట్టుకుంటే ఏమి లాభం. ఒక వేల, పొరపాటున  వాల్లకి శిక్ష పడినను ( చాలా కేసుల్లో శిక్షలు పడటం లేదు)  మనకు జరిగిన దానికి  ప్రత్యామ్నాయం లేదు కదా! రీప్లేస్మెంట్ లేదు/ ఉండదు కదా! ) Here also I am not supporting the culprits. ఇప్పటివరకు  జరిగిన వాస్తవాల్లను ఉటంకిస్తున్నాను అంతే! అందుకనే, కొన్ని precautions తీసుకొని మన జాగ్రత్తలో మనముండడం. అంటే-

  •  రాత్రుల్లో బయటకు పోవటం maximum avoid చేయటం.(can't but అనుకోండి అప్పుడు ఎటూ తప్పదు)
  • పెళ్లి  కాకుండా boy friends తో ఎక్కువ సేపు ఏకాంతంగా నిర్జీవ ప్రదేశాల్లో గడపక పోవటం.(boy friends  తో ఉన్నఅమ్మాయిలను చూస్తే చులకన భావం ఉంటుంది  ఇలాంటి వాళ్ళకి)
  • అనుకోని  సంఘటన ఏదైనా జరుగుతుందని అనిపిస్తే  భిగ్గరగా అరవడం
  • విద్యాలయాల్లో, కార్యాలయాల్లో అసభ్యకరంగా  ప్రవర్తించినను, ప్రేమ గీమ అని సతాయించినను వారి గురించి  పెద్దలకు అంటే అమ్మా నాన్నలకు , అధికారులకు చెప్పడం.   
  • స్వంత కుటుంబ సభ్యులతో తప్ప , చివరికి COUSINS, UNCLES(BOTH UNCLES) BROTHER FRIENDS     తో FREE  గా ఉండకపోవడం.
  • OWN FAMILY ని తప్ప ఎవరిని నమ్మకపోవడం .ఎవరిని నమ్మకూడదు అని ఎందుక చెప్పవలసి  వస్తోందంటే-
             ఈ మగాల్లందరూ  "THEY ARE NOT WHAT THEY ARE"
                     గొప్ప ఆంగ్ల  నాటక రచయిత  Shakespeare , తన నాటకమైన 'జూలియస్ సీజర్' లో విలన్ అయినటువంటి  Iago(ఇయాగో)తో  "I AM NOT WHAT I AM"  అని  పలికిస్తాడు . ఆ విధంగా                                  "MEN ARE NOT WHAT THEY ARE" SO దుష్టులకు దూరంగా ఉండడం మంచిది.
         సుప్రసిద్ధ ఆంగ్ల కవి MILTON గారంటారు-'If you want to test a person, give him power'  అని, అదే విధంగా
        IF YOU WANT TO TEST A PERSON(MAN), PROVIDE HIM WITH A CHANCE-The INNER MAN will come out.
        ఎందుకంటే- కురువృద్ధ గవర్నర్ మన రాజభవన్లో  చేసినటువంటి                            ఘనకార్యాలు. 
       అలాగనే ,పెళ్లి చేసుకుంటారా  అని ఏ వృద్దున్ని అడిగిన -నా కేవరిస్తారండి అమ్మాయిని  అని అంటారే గాని , నాకెందుకండి పెళ్లి అని  అననే  అనరు.
                                 
  చివరిగా- విజయవాడ లో హాస్టల్లో చంపబడిన అమ్మాయికి, exam hall లో నరకబడిన అమ్మాయికి మరియు  ఇలాంటి  ఎంతోమంది  అభాగ్యునిలకు ఇంతవరకు న్యాయం జరక్కపోవడం.
  ఇలాంటివన్నీ చూస్తుంటే మన జాగ్రత్తలో మనముండడము మంచిదేమో అనిపిస్తుంది! మీరేమంటారు?








Sunday 13 January 2013

SUBHAAKAANKSHALU

                           







                            ANDARIKI  SANKRAANTI SUBHAAKAANKSHALU