republic day

republicdayintelugu.jpg

Saturday 23 February 2013

ఇంకెన్నాళ్ళు ఈ నర.......

.............దీనికి  FULL STOP  లేదా?
                                        ఆపలేమా?
                  మరీ అంత చేతకాని వాళ్ళమా?
                                          దద్దమ్మలమా?
              అమాయకులు  బలికావలసిందేనా?
        అలాగయితే, ఎందుకీ మంది మార్భలం?           
ఓ పెద్ద  REPUBLICAN DEMOCRATIC COUNTRY. ప్రపంచంలోనే  అతిపెద్ద  సైన్యం కల్గిన దేశం.   
 ఓ  POWERFUL  DEVELOPING COUNTRY. అయినా ఈ నరమేదాన్ని ఆపలేకపోతున్నాము.

          అమెరికా లో  ఆ ఒక్క దాడి  తప్ప ,మరొకటి జరుగ లేదు. అది రక్షణ వ్యవస్థ అంటే. వారు నిజమైన రక్షకులు -పౌరులకి.
మనకూ ఉన్నారు-ఎలాంటి వాళ్ళంటే-
ఒకరంటారు, ఇంతపెద్ద  సువిశాల  దేశంలో ఎక్కడో ఒకచోట అరాచకం జరిగితే ,దానిని ఆపటం కష్టమని/సాధ్యం కాదని. (ఈయన తనకున్న ఒకే ఒక్క QUALIFICATION తో దేశాన్ని ఏలాలని కలలు కంటా వుంటారు) 

ఇంకొక మేడం అంటారు -డిల్లి లాంటి  నగరం లో అరాచకాలను  కట్టడి  చేయలేమని.ఈవిడ గారు  డిల్లి  CM.

ఇంకొక సారంటారు-మూడ్రోజుల ముందే  INFORMATION  ఇచ్చామని.

మన సారంటారు- అవి సాధారణ  హెచ్చరికలే అనుకున్నామని. ఇది మనపాలకుల భాగోతం.
                
                అరె జనాల ప్రాణాలకు  సంబందిన్చినది. అదియును గాక  కసబ్ను మరియు  గురును  ఉరి తీసి కొద్ది రోజులే అయింది. ఇలాంటి పరిస్తితులల్లో  సాధారణ  హెచ్చరిక  అని ఎలా  అనుకుంటారో నాకు  అర్థం  కావడం లేదు. అంటే పౌరుల ప్రాణాలంటే వీరికి లెక్కలేదు.

 పాలకులు ప్రజల మాన ధన ప్రాణాలకు  రక్షణ కల్పించాలి,రక్షకులుగా ఉండాలి. అంతే కానీ చేయలేము, సాద్యం కాదు, మామూలు హేచ్చారికే అనుకున్నాము  అంటూ ప్రజల్లో  భయాందోళనలు, గంధర గోలాలు  కలుగ చేయకూడదు.
                  మాఖియవెల్లి  అన్నట్లు, చేయలేకపోయిన చేస్తామ్మన్నట్లు ప్రజల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపాలి  కాని అలా అందోళనలకు గురిచేయకూడదు కదా!

   ఇంకా ఎంతమంది  అమాయకులు  మరణిస్తే  మన నాయకులకు కనువిప్పు కలుగుతుంది. అలా కలిగి ఈ నరమేదాన్ని ఎప్పుడు ఆపుతారు . అసలు ఆపగలరా అని సగటు భారతీయుని  సందేహం.
           
           ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకుని మన నాయకులు -పకడ్బంది వ్యూహంతో ప్రపంచం లో  పాకిస్తాన్ ను ఏకాకిని చేయడం.దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన కాపలాతో ముష్కురులను  దేశంలోకి చొరబడకుండా  చూడడం,దొరికిన ముష్కురులను న్యాయము, చట్టము  అంటూ కాలయాపన  చేయకుండా తక్షణమే శిక్షించటం,అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ,ప్రజా సమూహాల కూడలిలో ,RAILWAY STATION,BUS STAND లలో-
లేని చోట్ల C C  కెమెరాలను  అమర్చటం, ఉన్నవాటిని  PERFECT   గా      PERFORM చేయించటం,ప్రతివొక విషయంలో PHOTO  ID  CARD ని  కంపుల్సరి చేయడం ,ఏ విషయం లోను రాజీ పడక నిజాయితిగా  వ్యవహరించడం ద్వారా కొద్దిలో కొద్దిగైన  ఈ నరమేదాన్ని ఆపు తారని  ఆశిద్దాం.

     అలాగే పౌరులమైన మనము మన వంతు  కర్తవ్యాన్ని  పాటిద్దాం! ఎలాగంటే-
             ముక్కు మొఖం తెలియని  కొత్తవారికి గదులు ఇల్లులు రెంటుకివ్వక పోవడం
             ఒకవేళ ఇస్తే  TENANTS  PARTICULARS/INFORMATION ను దగ్గర గల పోలీస్ స్టేషన్ లో  ఇవ్వటం. అలాగే LODGES వారు కూడా  .PS లలో INFORMATION ఇవ్వటం.పరిసర ప్రాంతాలను గమనిస్తూ  ACTIVE గా ఉండడం.
        
చివరిగా -గోకుల్ చాట్, లుంబిని పార్క్ తదితర బ్లాస్టులు మరియు 21 న జరిగిన బ్లాస్టులను చూసి బాధ పడుతూ పెట్టిన పోస్ట్ ఇది.(మీరూ బాధ పడి ఉంటారు. ఆ మాటకొస్తే మనందరమూ  భాధ పడుతూనే ఉన్నాము) అంతే కాని ఎరిని నొప్పించాలని కాదు. అలా ఎవరినయిన నొప్పించి ఉంటె క్షంతవ్యుణ్ణి.

                                       జై భారత్! జై భారత్!! జై జై భారత్!!!

-