republic day

republicdayintelugu.jpg

Saturday, 12 May 2012

అమ్మా.........నీకు మరో పేరు..............

  అమ్మ.........

ఓ త్యాగం                                                      
ఓ  దైవం
ఓ  సహనం
ఓ  ఔషదం
ఓ  ప్రపంచం
ఓ  అద్భుతం
ఓ  అమృతం
ఓ  తియ్యదన
ఓ  దేవత
ఓ  ఫ్రెండ్
ఓ  గైడ్
ఓ శక్తి
ఓ  ఆశ
ఓ  పాట
ఓ  బడి
ఓ  కోచ్
ఓ  ప్రేమ
ఓ  ఆలన
ఓ  వెలుగు
ఓ  జాబిలి
ఓ కరుణామయి
ఓ మానవతామూర్తి
ఓ ఘంటసాల పాట
ఓ  తనివితీరనిపాట
ఓ  తిరుగులేని మాట
ఓ  వెలకట్టలేనిది
ఓ  విలువ కట్టలేనిది
ఓ  అమూల్యమైనది
             అసలు  అమ్మంటే,  WHAT  WHAT, WHAT NOT, EVERY THING, SHE IS EVERY THING.
ప్రపంచములో ఏదైనా కొనవచ్చును. అమ్మను కొనలేము కదా?!  అలాంటి  అమ్మను  మొన్నామద్య్హ వరంగల్
 దగ్గర ఓ  విలేజ్ లో UNEDUCATED SONS & DAUGHTER  కలసి రోడ్ ప్రక్కన వదిలి వెళ్ళిపోయారు.
మరి ఇక్కడో-సిటీలో మాయింటి ప్రక్కన ఓ EDUCATED ILLITERATE SONS తమతల్లి ఒక్కత్తినే  బాడుగ ఇంట్లో వుంచి కార్లల్లో వచ్చి చూసిపోతూ ఉంటారు,కొడుకులు, మనవల్లు,మనవరాండ్రు.
ఇక OLD AGE HOMES లో ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో లెక్కే లేదు. మరి అక్కడ శ్రీమతులకు అమ్మ కుదరక వేరే ఇంట్లో  పెట్టాల్సి వచ్చిందేమో! మరి అక్కడ స్త్రీలే కదా! అమ్మలే కదా! వనజ వనమాలి గారి లాంటి కోడళ్ళు ఉంటే దేశంలో  అత్తమ్మలందరూ ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారు కదా! జోహార్లండి మీకువనజవనమాలి గారు.
        ఉదయం లేవగానే  స్నానాలుచేసి, శుచి సుభ్రతతో దేవుళ్ళకు పూజలు చేసే సోదరులకు, సోదరీమణులకుఅమ్మలకు,అయ్యలకు,పాపల్లకు,పిల్లలకు నా యొక్క విన్నపము-ఉదయము లేవగానే మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి మీ దైనందిన కార్యక్రమాలు చూసుకోవాలని నా కోరిక.(మీరనవచ్చు-ఏంటండి హరి గారు మీరు పాటించారా అని !చదువుకొనే రోజుల్లో  పాటించానండి.అయితే తరువాత నాతల్లిదంద్రులను నేనుకోల్పోయానండి.)
     సోదరులార !బయట జరిగే అన్యాయాలను, అక్రమాలను -మనము ఏమీ చేయలేము.కాని మన తల్లి దండ్రులనుచూసుకోవడమనేది , మన చేతుల్లోనే ఉంది, ఆ అజమాయిషి మనదే, కాబట్టి అమ్మా నాన్నలను  చూసుకోండి!
       అమ్మ గురించి ఎప్పటినుండో రాయాలనుకుంటున్న నేను శ్రీను తపన చదివి ఈ టపా పెట్టాను. నాకు వర్నించడాలు, కవిత్వాలు,రచనలు రావు.ఏదో వ్యవహారిక బాషలో అమ్మగురించి  రాయాలనిపించింది,రాసాను.
        చివరిగా ఒక్క మాట-అమ్మకు మరో పేరు త్యాగము  అని నా ఉద్దేశ్యం. మరి మీదో!?

Thursday, 26 April 2012

ఎక్కడుంది లోపం? .............ఎవరు భాధ్యులు?


SENIOR INTER RESULTS వచ్చాయి!
       Physics లో 31 శాతం మాత్రమే పాసయ్యారు.మరి మిగాతవారు ఎందుకు ఫెయిలయ్యారు? వీరందరూ  చదువర్లు కారా?   క్లవర్   స్టూడెంట్స్ కాకపోయిన ,average, above average ఉండరా?మరి ఇంత ఎక్కువ శాతం fail కావటానికి గల కారణాలేమిటి?
                          విధ్యా ప్రమాణాలు పడిపోవడమా?
                          విద్యార్థుల్లో ఆ ZEAL లేకపోవటమా?
                          ప్రశ్నాపత్రాలు తయారుచేసిన వారి భాద్యతారాహిత్యమా?
                         గుడ్డినిద్రపోయే  ప్రభుత్వమా? లేక
                         సోకాల్డ్  కార్పోరేట్ విద్యాసంస్థలా?
విద్యార్థులేమో non  syllabi questions ఇచ్చారని,ప్రభుత్వమేమో ఎక్కువ ప్రశ్నలు  SYLLABI లో ఉన్నవే ఇచ్చామనిSTATEMENTS యిస్తున్నారు
         
    అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పేది చూస్తే సిగ్గేస్తుంది,నవ్వొస్తుంది.,కోపమూ వస్తుంది. ఎందుకంటే -ఎక్కువ ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇచ్చామని చెప్పడం. ఎక్కువ ఇవ్వడమేమిటి (అప్పటికేదో మెహర్బానీచేసినట్లు), అసలు అన్ని ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇవ్వాలి కదా!?


              ఇక  స్టూడెంట్స్  విసయానికొస్తాం-వీళ్ళు  SYLLABI లో ఉన్న ఏ ప్రశ్నైన రాయాలి కదా!? అలా రాయాలంటే మొత్తం  SYLLABI  చదివుండాలి/నేర్చుకునుండాలి. SYLLABI లో ఏ ప్రశ్న ఇచ్చిన  రాయకలిగి ఉండాలి.ఎందుకంటే కొన్ని QUESTIONS  OUT OF SYLLABI  ఉన్నప్పటికీ  మిగతా  ప్రశ్నలు రాస్తే  కనీసం
పాస్ మార్కులోస్తాయి కదా! SO, ఇక్కడ స్టూడెంట్స్  మొత్తం SYLLABI చదవకుండ ఏదో కొంతమేరకే చదివుంటారనేది జగమెరిగిన సత్యం.(ఇప్పుడున్నటువంటి సినారియోలో వారిని సిలబై అంతా చదవమనడం/నేర్చుకోమనడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి టైము సరిపోవడం లేదు. ఉన్న టైమంతా-SMS లకు,
సెల్లులకు, సినిమాలకు,BOY/GIRL FRIENDS కు మరియు ముఖ పొత్తము (అదేనండి FACE BOOK) లకే
సరిపోతుంది)
   
                  ఇక విద్యాసంస్థల విషయానికొస్తే- ప్రభుత్వ సంస్థలను వదిలేద్దాం(అవి ఉన్న లేనట్లే).
ఇక CORPORATE INSTITUTIONS-వేలకు వేలు ఫీజు తీసుకొని తమ వ్యాపారాలను (విద్యా  వ్యాపారం)వృద్ధి
చేసుకుంటున్నారే గాని ,అసలు వీళ్ళు విద్య నేర్పుతున్నారా!? ఎక్కువ శాతం ఉన్న AVERAGE, ABOVE AVERAGE STUDENTS ల ఫీజులతో అతి తక్కువ ఉన్న బ్రిలియంట్స్ కు పట్టం కడుతున్నారు, ఇతర విద్యార్థులను పట్టించుకోకుండా .


        సో, మొత్తం మనందరిదగ్గర లోపం ఉంది. మనందరం భాద్యులమే!


PERFECT QUESTION PAPER తయారుచేయని వారిని ప్రభుత్వం పట్టిచ్చుకోదు/శిక్షించదు.
వేలకువేలు ఫీజులు కడతాం,వేలు పోసి అరచేయి మహమ్మారిని కొనిస్తాం, కాని పర్యవేక్షణ ఉండదు
లక్షలు పెట్టి  ప్రభుత్వాన్ని కొంటారు, ADS గుమ్మరించి మనలను  బుట్టలో వేసుకుంటారు,కాని  చదువు చెప్పరు
ఇదీ నేటి దుస్థితి. మరి మనము ఏమీ చేయలేమా ...?మీరే చెప్పండి!!