republic day

republicdayintelugu.jpg

Saturday 25 February 2012

....ఏమి కావాలని.....

దేవుడే దిగివచ్చి "ఏమికావాలని" కోరుకోమంటే -

బాగా చదువుకోవాలని  కోరుకునే వాన్ని,చిన్నవయసులో !
మంచి ఉద్యోగం ,మంచి  శ్రీమతి కావాలని కోరుకునేవాన్ని యుక్తవయసులో ! !

ఆ తరువాత  -' కీర్తి శేషులైన నా తల్లిదండ్రులు  కావాలని ,
వారితోపాటు  గాంధీ గారిని ,అంబేద్కర్ గారిని ,శాస్త్రి గారిని ,భగత్ సింగ్  గారిని ,
ఎన్టీయార్ గారిని ,ఘంటసాల గారిని ,సావిత్రి గారిని  ,ఎస్వీఆర్  గారిని ,రాజనాల గారిని ,కాంతారావ్  గారిని ,
నా పిల్లల మంచి భవిష్యత్ ని మరియు నా బాల్యాన్ని  కోరుకున్దామని ' అనికునేవాన్ని .కాని ఇపుడు 

వీటన్నిటిని త్యాగం చేసి ఒకే ఒక్క కోరిక కోరాలను కుంటున్నాను  , అదే-
ప్రపంచంలోని ఏశక్తి  ఆపలేని  రియల్  లేని టీవీ సీరియల్ స్ ని  ఆపమని,
మనుషుల  చేతిలోని బుల్లి భూతాన్ని మాయం చేయమని ,
అంతర్జాలములోని కలుషిత సాలీడులను  పటాపంచల్ చేయమని !!!

1 comment:

  1. చాలా చాలా బాగా చెప్పావు హరి
    టివి మీద వున్నా ఏహ్య భావాన్ని
    భలే చూపించావు
    నీవన్నట్లు ఈ భూతం మాయమైతే
    పిల్లలు బాగా చదువుకొని
    తల్లులు సంసారాన్ని చక్క దిద్దే పనిలో పడవచ్చు

    ReplyDelete