republic day

republicdayintelugu.jpg

Thursday 26 April 2012

ఎక్కడుంది లోపం? .............ఎవరు భాధ్యులు?


SENIOR INTER RESULTS వచ్చాయి!
       Physics లో 31 శాతం మాత్రమే పాసయ్యారు.మరి మిగాతవారు ఎందుకు ఫెయిలయ్యారు? వీరందరూ  చదువర్లు కారా?   క్లవర్   స్టూడెంట్స్ కాకపోయిన ,average, above average ఉండరా?మరి ఇంత ఎక్కువ శాతం fail కావటానికి గల కారణాలేమిటి?
                          విధ్యా ప్రమాణాలు పడిపోవడమా?
                          విద్యార్థుల్లో ఆ ZEAL లేకపోవటమా?
                          ప్రశ్నాపత్రాలు తయారుచేసిన వారి భాద్యతారాహిత్యమా?
                         గుడ్డినిద్రపోయే  ప్రభుత్వమా? లేక
                         సోకాల్డ్  కార్పోరేట్ విద్యాసంస్థలా?
విద్యార్థులేమో non  syllabi questions ఇచ్చారని,ప్రభుత్వమేమో ఎక్కువ ప్రశ్నలు  SYLLABI లో ఉన్నవే ఇచ్చామనిSTATEMENTS యిస్తున్నారు
         
    అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పేది చూస్తే సిగ్గేస్తుంది,నవ్వొస్తుంది.,కోపమూ వస్తుంది. ఎందుకంటే -ఎక్కువ ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇచ్చామని చెప్పడం. ఎక్కువ ఇవ్వడమేమిటి (అప్పటికేదో మెహర్బానీచేసినట్లు), అసలు అన్ని ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇవ్వాలి కదా!?


              ఇక  స్టూడెంట్స్  విసయానికొస్తాం-వీళ్ళు  SYLLABI లో ఉన్న ఏ ప్రశ్నైన రాయాలి కదా!? అలా రాయాలంటే మొత్తం  SYLLABI  చదివుండాలి/నేర్చుకునుండాలి. SYLLABI లో ఏ ప్రశ్న ఇచ్చిన  రాయకలిగి ఉండాలి.ఎందుకంటే కొన్ని QUESTIONS  OUT OF SYLLABI  ఉన్నప్పటికీ  మిగతా  ప్రశ్నలు రాస్తే  కనీసం
పాస్ మార్కులోస్తాయి కదా! SO, ఇక్కడ స్టూడెంట్స్  మొత్తం SYLLABI చదవకుండ ఏదో కొంతమేరకే చదివుంటారనేది జగమెరిగిన సత్యం.(ఇప్పుడున్నటువంటి సినారియోలో వారిని సిలబై అంతా చదవమనడం/నేర్చుకోమనడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి టైము సరిపోవడం లేదు. ఉన్న టైమంతా-SMS లకు,
సెల్లులకు, సినిమాలకు,BOY/GIRL FRIENDS కు మరియు ముఖ పొత్తము (అదేనండి FACE BOOK) లకే
సరిపోతుంది)
   
                  ఇక విద్యాసంస్థల విషయానికొస్తే- ప్రభుత్వ సంస్థలను వదిలేద్దాం(అవి ఉన్న లేనట్లే).
ఇక CORPORATE INSTITUTIONS-వేలకు వేలు ఫీజు తీసుకొని తమ వ్యాపారాలను (విద్యా  వ్యాపారం)వృద్ధి
చేసుకుంటున్నారే గాని ,అసలు వీళ్ళు విద్య నేర్పుతున్నారా!? ఎక్కువ శాతం ఉన్న AVERAGE, ABOVE AVERAGE STUDENTS ల ఫీజులతో అతి తక్కువ ఉన్న బ్రిలియంట్స్ కు పట్టం కడుతున్నారు, ఇతర విద్యార్థులను పట్టించుకోకుండా .


        సో, మొత్తం మనందరిదగ్గర లోపం ఉంది. మనందరం భాద్యులమే!


PERFECT QUESTION PAPER తయారుచేయని వారిని ప్రభుత్వం పట్టిచ్చుకోదు/శిక్షించదు.
వేలకువేలు ఫీజులు కడతాం,వేలు పోసి అరచేయి మహమ్మారిని కొనిస్తాం, కాని పర్యవేక్షణ ఉండదు
లక్షలు పెట్టి  ప్రభుత్వాన్ని కొంటారు, ADS గుమ్మరించి మనలను  బుట్టలో వేసుకుంటారు,కాని  చదువు చెప్పరు
ఇదీ నేటి దుస్థితి. మరి మనము ఏమీ చేయలేమా ...?మీరే చెప్పండి!!




     
       










     


                

25 comments:

  1. హరి గారు,
    రవిశేఖర్ గారిని అడిగాను నేను ..వారు చెప్పిన సమాధానం :
    ఈ సం:ఏమయిందంటే బ్లూ ప్రింట్ ప్రకారం ఇవ్వకుండా వేరే అంశాల్లో ఇచ్చారు.పిల్లలేమో అవి రావనుకొని చదవలేదు.కాని తెలివైన విద్యార్థులు అన్ని చదువుతారు కాబట్టి వారికి 60/60 కూడా వచ్చాయి .ఈ సం:మాత్రమే ఈ సమస్య.బ్లూ ప్రింట్ అంటే ఏ పాఠం లోఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి,ఏ భావనల కు ఎంత శాతం weightage ఇవ్వాలి అని.ఇవన్నీ ముందే నిర్ణయించి అన్ని కాలేజి లకు పంపుతారు.దాని కనుగుణం గా బోధన జరుగుతుంది.అలా ఈసారి ఇవ్వలేదన్న మాట."

    నా ఉద్దేశం లో విధ్యార్దులు కష్టపడి చదవాలండి. ఈ పాఠం లో ప్రశ్నలు రావు కనక చదవక్కర్లేదు అనో, ఈ పాఠం లోంచి 2/3 ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ పాఠం చదవాలి అని అనుకుంటే ఇంక సుబ్జక్ట్ నేర్చుకుంటారంటారా? పరీక్షలో పాస్ అవ్వడం ఒక్కటేనా ధ్యేయం?

    ReplyDelete
  2. జలతారువెన్నెల గారూ!
    మీ స్పందనకు ధన్యవాదాలండి.
    మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ అండి. పిల్లలు కష్టపడి మరియి ఇష్టపడి కూడా చదవాలి.ఏదో EXAM PURPOSE గా చదివితే లాభం లేదండి.అందుకనే నేను సిలబై మొత్తం చదవాలని చెప్పానండి.
    ఆ ఒక్క ధ్యేయమే ఉండకూడదు అండి.
    Once again thanq so much for your kind response and encouragement please.

    ReplyDelete
  3. మరచి పోయానండి జలతారువెన్నెల గారు,
    మీ ఫిజిక్స్ కష్టాలు మరియు అమెరికా చదువులు చూసానండి. మంచి Vసహాయాలు తెలియపరుస్తున్నారు,Pl.goahead

    ReplyDelete
  4. @జలతారు వెన్నల గారు హరి గారు మీరిరువరు ప్రస్తావించిన విషయాలు చాలా ముఖ్యమైనవి అవే కాకుండా నా విశ్లేషణను మీతో పంచుకోదలిచాను...
    విద్యార్థులు అన్న పదానికి ఇప్పుడు అర్థం లేకుండా పోతోంది.. విద్య ప్రమాణాలు కూడా తగ్గుతున్నాయి.. ఒకసారి నా విద్యార్థితో సంభాషణ ఇలా కొనసాగింది
    నేను : ఏరా ఇలా చెప్పిన మాట వినకపోతే ఎలా
    వాడు : ఎం చేయను సర్ నాకేం అర్థం కావట్లేదు
    నేను: ఎందుకు అర్థం కావట్లేదు మరి డౌట్స్ అడగట్లేదు హొంవర్క్ చేయట్లేదు ఎలా అర్థమౌతుంది
    వాడు : అయినా చెప్తే వినేవాడు స్టూడెంట్ కాదు సర్

    ఆ మాట విన్న తరువాత నాకు ఎం చెప్పాలో అర్థం కాలేదు సినిమాల ప్రభావం ఎంత ఉందో అర్థమైంది. స్టూడెంట్ ని కేవలం హీరోగానే చూపడం తప్ప చదివే వాడిగా చూపడం తక్కువైంది. పైగా ఆ సంభాషణను రక్తికట్టించడానికి వారు రాసే సంభాషణలు విద్యార్థుల్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు అందరు తెలివి కోసం చదవట్లేదు కేవలం ఒక అర్హతకోసమే చదువుతున్నారు. చదువు పూర్తి అయ్యేసరికి ఉద్యోగానికై ఎన్నో పెడదోవలు తొక్కుతున్నారు.
    ఇక సిలబస్ విషయానికి వస్తే చాలా మటుకు పుస్తకాలను చాలా తక్కువ మంది అనుసరిస్తున్నారు పైగా విశ్లేషణ లేదు . ఉన్నది ఉన్నట్టుగానే చదివితే ఇక ఆలోచించే విధానం ఎలా తెలుస్తుంది.
    ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక గమ్యం లేదు ఉద్యోగ అవకాశాలు ఎందులో మెండుగా వున్నాయో వాటిని చేయడం ప్రారంబిస్తున్నారు కాని వారు చెయ్యాలనుకున్నది చేయట్లేదు.. దానివల్ల ఆత్మవిశ్వాసం కొరవడుతోంది. పైగా ఇప్పుడు ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోవటం వలన ఇష్టం వచ్చినట్టు చేరుతున్నారు కేవలం ఆ ఒక్క లాభానికి. ఇక చదువు మీద ఏ ధ్యాస ఉంటుంది. ఇలా ప్రస్తావిస్తుంటే ఎన్నో లోటు పాట్లు విధ్యార్తుల్లోనే కాదు అందరిలోనూ . వీటిని సరి చేయడానికి మన అందరి కృషి ఎంతగానో ఈ సమాజానికి అవసరం.

    ReplyDelete
    Replies
    1. కళ్యాణ్ గారు!
      ఓపికతో కోడిన సుదీర్ఘమైన విశ్లేషణ మరియి స్పంధనకు నా ధన్యవాదాలు.
      నా అభిప్రాయముతో ఏకీభవించి లోటుపాట్లు అందరిలోనూ ఉన్నాయనే విషయాన్నీ మీరు కూడా విశదపరిచారు,థాంక్స్.
      29-01-2012 న మీ బ్లాగ్ లో "మానవత్వం" పై మీరు వ్రాసిన చిట్టి కవిత నన్నెంతో ఆకట్టుకుంది.అక్కడే నా కామెంట్ పెట్టాను.బహుశ మీరు చూసి ఉండక పోవచ్చు.తప్పకుండ ఆ కామెంట్ ను చూడగలరు.
      మీ బ్లాగ్ బాగుంది.బ్లాగ్ టైటిల్ కూడా బాగుంది.వెంటనే నా బ్లాగ్ లిస్టు లో మీ బ్లాగ్ ను చేర్చాను.
      మీరు కవితలు,columns,రచనలు అన్నీ చేయుచున్నారు,చాలా సంతోషం.keep it up.
      నేనయితే-నేను రచయితను కాను,
      కవిని కాను,
      కాలమిస్టును కాను-అయితే

      మనదేశములో జరిగే
      అన్యాయాలు,అరాచకాలు,
      అక్రమాలు,దొపిడీలు,
      మోసాలు,దమనకాండలు మొదలగు
      ఈవిల్స్ ని చిన్నప్పటినుంచి చూసి చూసి,విసిగి విసిగి,ఏమీచేయలేక, మనము ఏమీ చేయలేమా అని అనుకునే ఓ సగటు జీవిని.

      ఎమీ చేయలేక నాలోని ఆవేశాన్ని,ఆక్రోశాన్ని
      ఆవేధనను,బాధను,స్పంధనను పంచుకోవాలనుకొని
      manamu emee cheyalemaa.....? అనె ఓ చిన్నblog nu open చేసాను .
      మీరు కూడా నా బ్లాగ్ లో మెంబెర్ అయినందుకు చాలా సంతోషం.
      నా టపాలన్నీ చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు

      Delete
    2. @హరి గారు అది చూసాకే మీ బ్లాగ్ చూసానండి చాల సంతోషం కలిగింది....ఇంకా దానికి జవాబు ఇవ్వలేదు వెంటనే మీ బ్లాగ్ చూసి కామెంట్ పెట్టాను ..... నేను కూడా ఏ కోవకు చెందిన వాడినో తెలియదు కాని నా ఆలోచనలను పంచుకోవాలనే ప్రయత్నం లో ఎలాగంటే అలా మారాలి అనే ఒక ప్రయత్నం మాత్రం.... మన విధానాలు వేరైనా గమ్యం ఒక్కటే.. నలుగురికి మంచి చేయాలి , సమాజానికి మన ఆలోచనలు ఉపయోగ పడాలి అనేదే ప్రధాన ఉద్దేశం.... ఇకపై మనం కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తూ మీ స్నేహం కోరుతున్నాను...

      Delete
    3. కళ్యాణ్ గారు,
      thank you very much for your response.
      అలాగేనండి,కలసి పని చేద్దాం.
      Glad to meet you

      Delete
  5. హరి
    విద్యార్థులగురించి,విద్యాప్రమాణాలుగురించి
    చాలా చక్కగా విశ్లేషించావు
    ఎప్పటికి నిజమైన విద్యార్ధుల ప్రతిభ రాణిస్తూ వుంటుంది
    తల్లిదండ్రులకోసమో కార్పోరేట్ కాలేజీల కోసమో చదివే చదువు తేలిపోతుఉవుంటుంది
    కళ్యాణ్ గారు అన్నట్లు
    ఇతరప్రభావాలు చాలా ఎక్కువగా వుంటున్నాయి విద్యార్ధులమీద.

    ReplyDelete
    Replies
    1. శ్రీను,
      చాలరోజులకు బ్లాగులో కలిసాము.ఎలా ఉన్నావ్?
      అవును శ్రీను, నువ్వన్నట్లు అలాంటి చదువు ఖచ్చితంగా తేలిపోతుంది.
      Thanq verymuch sreenu for your nice response and encouragement.
      How about your postings?I have been eagerly awaiting them.
      Mother ఏలే ఉన్నారు?
      అన్నట్లు శ్రీను,కళ్యాణ్ గారిది తిరుపతేనట.u can c his profile

      Delete
  6. కళ్యాణ్ గారూ చెప్పినట్లు సినిమాల ప్రభావం యువతమీద చాలా ఉంటోంది. ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా పట్టించుకోని తత్వం చూసి బాధ కలుగుతోంది. చిన్న, పెద్దా, మంచి, మర్యాద ఏమీ లేకుండా పోతోంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారు!
      మీ స్పందన కరక్టేనండి.అందుకనే చిన్నతనము నుండే మన culture నేర్పించాలండి.అది 'అమ్మఒడి' అనే బడి నుండే ప్రారంభించబడాలండి!
      ఏమంటారు? ఆ గులాబి పూల తర్వాత మీ టపాలు రాలేదండి.AWAITING అండి.
      మీ స్పందనకు ధన్యవాదాలండి!ఇలాగే ఎప్పుడు మీ encouragement ఉండాలండి.

      Delete
  7. హరిగారు,
    ఇంత క్రితం అమ్మఓడి బ్లాగు ఆమే ఇలాగే బాధపడేది. ఆమే మీలా టపాలు రాస్తూ కూచొనక ఎప్పుడో 10-15సం || క్రితమే పోలిస్ కంప్లైంట్ ఇచ్చింది. చాలామంది ఆమేకు మతి స్థిమితం లేదని వ్యాఖ్యానించే వారు
    http://ammaodi.blogspot.in/2011/01/blog-post_31.html

    ReplyDelete
    Replies
    1. anonymous గారు!
      మీ స్పంధనకు థాంక్స్.
      society లో గల evils ని మనమెటూ erodicate చేయలేము.కనీసం వాటికి స్పందించటం కూడా తప్పంటే ఎలాగండి. ఆమె పోలీసు వారికి complaint ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావటం లేదండి!బహుశ పోలీసు వారంటే "మంచివారు"అని అనుకుని ఉంటున్దేమోనండి.పోలీసు వారిదగ్గరకెల్తే న్యాయము జరుగుతుందని మీరనుకుంటున్నారా అండి.న్యాయస్థానాల్లో న్యాయానికి న్యాయం జరుగుతుందా అండి.ఒక కేసును ఇద్దరు liers,iam sorry lawywrs వదిస్తున్నారంటే ,అందులో ఒకరిది ఖచ్చితంగా అసత్యమై
      ఉంటుంది కదండి.అసలు మనదేశంలో ఏ వ్యవస్థలోనైనా సత్యం ఉందా అండి.ఇదో ఫలానా దానిలో మోసం లేదు అని మీరు చూపించగలర అండి.అసలు anti-corruption bureau లోనే corruption ఉంటె ,ఇక ఈ దేశంలో మంచి జరుగుతుందని మీరనుకుంటారా?
      (చేతకానివాళ్ళు పాలకులు-అనే నా ఈ టపాను ఒక్కసారి నా బ్లాగ్లో చదవండి.) ఈ దేశం లో ఉండే చట్టాలు కానివ్వండి,రూల్స్ కానివ్వండి లేక ఆదేశాలు కానివ్వండి:ఇవ్వన్ని కేవలం అనామకులకు,బలహీనులకేనండి.
      వీటిని మనమేమీ చేయలేమని నాకు తెలుసు,మీకు తెలుసు.కాకపోతే జనాలతో పంచుకుందామని,భావాలను.
      ఇది కూడా చేయకూడదని మీరంటే దానికి నేనేమి చేయలేను

      మరొక సారి ధన్యవాదాలు,నా బ్లాగ్ ను మీరు చదువుచున్నందలకు.

      Delete
  8. /PERFECT QUESTION PAPER తయారుచేయని వారిని ప్రభుత్వం పట్టిచ్చుకోదు/శిక్షించదు./
    Perfect Question Paper అంటే?! 100% పరిపూర్ణత సాధించే పేపర్ అనా?!

    ఒక ప్రశ్నపత్రం లో <20% సిలబస్‌కు కొద్దిగా వెలుపల ఇవ్వడంద్వారా 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా'అన్నట్టు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను కొద్దిగా మందనుంచి వేరు చేసి చూపడానికి ఆస్కారం వుంటుంది. 20% మించి సిలబస్ వెలుపల ఇచ్చివుంటే అది శిక్షింపతగ్గ తప్పు, ఆ పేపర్ సెట్ చేసిన వాళ్ళను నల్లమల/శ్రీకాకుళం అడ్వులు(అనేవి వుంటే)/శంకరగిరి మాన్యాలకు పోస్టింగ్ చేయాల్సిందే - అని నా అభిప్రాయం.

    ReplyDelete
  9. ఎస్సెన్కేఆర్ గారు,
    మీ స్పందనకు థాంక్సండి!
    PQP అంటే -SYLLABI కి లోబడి అని నా ఉద్దేశ్యం.
    100% పరిపూర్ణత అంటే,ఎందులోను?
    gaining knowledge లోనా?
    getting marks లోనా?
    20% less అని కాకుండా course of study లో ఉండేదిస్తే పోతుంది కదా అండి,ఏ గొడవలేకుండా!ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. /100% పరిపూర్ణత అంటే,ఎందులోను?
      gaining knowledge లోనా?
      getting marks లోనా?/
      మార్కులనే అంకెల్లో చెప్పగలము, జ్ఞానాన్ని కాదు. 100% పరిపూర్ణమైన జ్ఞానిని అనుకునేవాడు ఒక్క మూర్ఖుడు మాత్రమే అని పురాణాలు,వేదాలు ఘోషిస్తున్నాయి.
      /20% less అని కాకుండా course of study లో ఉండేదిస్తే పోతుంది కదా అండి,ఏ గొడవలేకుండా!ఏమంటారు?/
      అన్నాను కదా, 'పురుషులందు...' అని? ఓకే 'విద్యార్థులందు, మేలి విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించడానికి అని అవ్నయించుకోండి. గొడవదేముంది, పనికిమాలినోళ్ళు ఎప్పుడూ 'ఫ్రీ' గా అందినంత అందబుచ్చుకుందామనే చూస్తారు.
      మార్కుల విధానంలో సమస్యేమంటే... గతంలో ఈజీగా పేపర్ పొందిన వాళ్ళకూ టఫ్ పేపర్ పొందిన వాళ్ళకు తేడా వుండదు, అంతా ఒకే గాటికి(మార్కులకు) కట్ట బడతారు. గ్రేడింగ్ సిస్టం కొంతవరకూ బెటర్.

      Delete
  10. గతంలో ఈజీ...... అన్నారు కదా,

    stuff లేని వారు తెలిపోతారండి ఎప్పటికైనా!
    ఇందులోనే sreenu గారి కామెంట్ చూడండి!!

    ReplyDelete
  11. మీరు చెప్పినట్టు తెలివయిన విద్యార్థి అన్నీ చదివి ఏది ఇచ్చినా వ్రాసేస్తాడు. కానీ ఉపాధ్యాయులే పూర్తిగా సిలబస్ పూర్తిచేయనప్పుడో? సరే పోనీ అతనే చదువుకున్నాడు అనుకుందాం ఎంత వరకు స్వంతంగా చదువుతాడు? అదీ ఇంటర్ అంటే ఈ కాలంలో పిల్లలకి చదవాలి అన్న ఆసక్తి కన్నా ఎప్పుడు పారిపోదామా అనే ఉంటుంది వాళ్లకి అంతలా రుద్దేస్తున్నారు. వత్తిడి లేకుండా ఉన్నప్పుడే ఆరోగ్యకరమయిన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి చదవాలన్న శ్రద్ధ కలిగి ఎవరు పాఠాలు చెప్పినా చెప్పకపోయినా వారికి వారే చదువుకోగలరు. వత్తిడి ఉన్నంత వరకూ వారు కేవలం మార్కుల కోసం తప్ప సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఎన్నటికీ చదవరు. అందుకే బ్లూ ప్రింట్లు, వగైరాలను ఆశ్రయిస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారు,
      first of all permit me to say sorry for my late response.
      నేను ఊర్లో లేనండి.ఈరోజే వచ్చాను.మీ స్పందనకు ధన్యవాదాలు.
      పిల్లలపై ఒత్తిడికి మనమందరమూ కారణమే అని నేను ఆ పోస్ట్ లో చెప్పాను.
      అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉందండి, corporate colleges అన్నీ పొతే ,అందరూ govt colleges లో చదవగలిగితే-అప్పుడు
      అందరికి ప్రశాంతత లభిస్తుందని నా ఉద్దేశ్యం
      నా బ్లాగ్ చదివి స్పందించినందుకు మరొక సారి ధన్యవాదాలు.
      ఎల్లప్పుడు మీ encouragement ను కాంక్షిస్తూ-

      Delete
  12. రసజ్ఞ గారు చాలా చక్కగా చెప్పారు
    ఏ వత్తిడి లేని గవర్నమెంట్ కాలేజీలలో పాస్ పెర్సెంట్
    బాగా పెరిగిందని వార్తలు.
    ఏది ఏమైనా చక్కటి ప్రశాంత వాతావరణంలో చదివే అవకాశాన్ని
    పిల్లలకు పెద్దలెవరూ కలిగించడం లేదని నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. sreenu,
      చాలా రోజుల తరువాత నీ కామెంట్ కనపడింది.థాంక్స్.
      రసజ్ఞ గారు చెప్పింది కరక్టే శ్రీను.

      అందులో మనము కూడా పాత్రదారులమే కదా శ్రీను!

      Delete
  13. am raju, sir ekkada undi lopam evaru badyulu ane comment chadivanu ellani blogs mamundu enkenno pettalani ashistunamu kani naku oka dought so mana andari lopamu undi manamu andaramu badyulame annaru kada kani monati paparlo oka vyakthi story chadivanu thanu govt college student commonga govt college lo classes garagavu okavcela garigina ataniki college velladaniki ledu endukate athanu anada athanu edovokapani chesukoni athanu chadukovali kani entha katinamina pepars este ela raya galru ellantivaru ellati ento poor candidates villa paristi enti pls give reply from raju mca

    ReplyDelete
    Replies
    1. Mr.Raaju-
      first of all let me convey my thanks 2 u for ur viewing my blog and posting a comment.

      రాజు,
      ఒక్కోక్కరికోసం ఒక్కో విధమైన ప్రశ్నాపత్రాన్ని తయారుచేయరుగా! ఓ నిరుపేద విద్యార్థి కోసం easy question paper ను, rich student కోసం difficult paperను తయారు చేయరుగా! అలా చేసిన అది కరెక్ట్.కాదు కదా! ఇక్కడ రిచ్చా, పూరా అనేది కాదు
      పాయింట్. విద్యార్థులు తెలివితేటలను సముపార్జించ లేక పోతున్నారు. దానికి ప్రభుత్వం, మీడియా,కార్పోరేట్ విద్యాసంస్థలు, సినిమాలు,
      సెల్లులు,అంతర్జాలము, ఫారిన్ కల్చర్ తల్లిదండ్రులు ఇలా ప్రతివొక్కటి/ఒక్కరు దోహద పడుతున్నాయి/పడుతున్నారు
      అందువలన సున్నితమనస్కులైన పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక తెలివితేటలను గ్రహించలేక పోతున్నారు.అది నాబాధ.

      Delete
  14. hi sir gd evening am raju, eppudu ssc lo greding system use chesi results released chesaeu kada danivalana use enty pls give me reply

    ReplyDelete
  15. very nice observation, Father ! I am glad to know that discussions like this help us a lot in understanding variations. As you said, this technological world, parents, teachers and friends are responsible for inter students pass percentage. But we just cant blame those students who failed because of many attractions and diversions. Because everything has a reason. As you said in the yesterday's discussion, mobiles and internet are distractung human relations. I do agree with it. But as far as my observation, human in nature gets accustomed to the surroundings. For example, in olden days people use to live without light for many years by using basic means like lanther. Now, we have many resources of light that we cant even imagine our life without it. Human tendency is the same from past to present. Just the surroundings matter.So we cant blame any generation . Only the surroundings, changes does make a difference.And now coming out of this topic, as of now i am typing this message in my mobile internet. But my father and grandmother feel that i am doing some useless chating. And dven when I was in training for about 4 months , The training was literally too hectic that i couldnt even contact my parents well atleast once a day. But my friends and relatives felt that i forgot them and enjoying my life at Training. If everyone's perception is very different in such a small issue, then how can we judge a bigger situation ? This is not considering about this post. My question is general. And the points i made are my own perception and not to hurt anyone. Waiting for your reply !
    Budha Sree

    ReplyDelete