republic day

republicdayintelugu.jpg

Saturday 23 February 2013

ఇంకెన్నాళ్ళు ఈ నర.......

.............దీనికి  FULL STOP  లేదా?
                                        ఆపలేమా?
                  మరీ అంత చేతకాని వాళ్ళమా?
                                          దద్దమ్మలమా?
              అమాయకులు  బలికావలసిందేనా?
        అలాగయితే, ఎందుకీ మంది మార్భలం?           
ఓ పెద్ద  REPUBLICAN DEMOCRATIC COUNTRY. ప్రపంచంలోనే  అతిపెద్ద  సైన్యం కల్గిన దేశం.   
 ఓ  POWERFUL  DEVELOPING COUNTRY. అయినా ఈ నరమేదాన్ని ఆపలేకపోతున్నాము.

          అమెరికా లో  ఆ ఒక్క దాడి  తప్ప ,మరొకటి జరుగ లేదు. అది రక్షణ వ్యవస్థ అంటే. వారు నిజమైన రక్షకులు -పౌరులకి.
మనకూ ఉన్నారు-ఎలాంటి వాళ్ళంటే-
ఒకరంటారు, ఇంతపెద్ద  సువిశాల  దేశంలో ఎక్కడో ఒకచోట అరాచకం జరిగితే ,దానిని ఆపటం కష్టమని/సాధ్యం కాదని. (ఈయన తనకున్న ఒకే ఒక్క QUALIFICATION తో దేశాన్ని ఏలాలని కలలు కంటా వుంటారు) 

ఇంకొక మేడం అంటారు -డిల్లి లాంటి  నగరం లో అరాచకాలను  కట్టడి  చేయలేమని.ఈవిడ గారు  డిల్లి  CM.

ఇంకొక సారంటారు-మూడ్రోజుల ముందే  INFORMATION  ఇచ్చామని.

మన సారంటారు- అవి సాధారణ  హెచ్చరికలే అనుకున్నామని. ఇది మనపాలకుల భాగోతం.
                
                అరె జనాల ప్రాణాలకు  సంబందిన్చినది. అదియును గాక  కసబ్ను మరియు  గురును  ఉరి తీసి కొద్ది రోజులే అయింది. ఇలాంటి పరిస్తితులల్లో  సాధారణ  హెచ్చరిక  అని ఎలా  అనుకుంటారో నాకు  అర్థం  కావడం లేదు. అంటే పౌరుల ప్రాణాలంటే వీరికి లెక్కలేదు.

 పాలకులు ప్రజల మాన ధన ప్రాణాలకు  రక్షణ కల్పించాలి,రక్షకులుగా ఉండాలి. అంతే కానీ చేయలేము, సాద్యం కాదు, మామూలు హేచ్చారికే అనుకున్నాము  అంటూ ప్రజల్లో  భయాందోళనలు, గంధర గోలాలు  కలుగ చేయకూడదు.
                  మాఖియవెల్లి  అన్నట్లు, చేయలేకపోయిన చేస్తామ్మన్నట్లు ప్రజల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపాలి  కాని అలా అందోళనలకు గురిచేయకూడదు కదా!

   ఇంకా ఎంతమంది  అమాయకులు  మరణిస్తే  మన నాయకులకు కనువిప్పు కలుగుతుంది. అలా కలిగి ఈ నరమేదాన్ని ఎప్పుడు ఆపుతారు . అసలు ఆపగలరా అని సగటు భారతీయుని  సందేహం.
           
           ఇప్పటికయినా బుద్ధి తెచ్చుకుని మన నాయకులు -పకడ్బంది వ్యూహంతో ప్రపంచం లో  పాకిస్తాన్ ను ఏకాకిని చేయడం.దేశ సరిహద్దుల్లో దుర్భేద్యమైన కాపలాతో ముష్కురులను  దేశంలోకి చొరబడకుండా  చూడడం,దొరికిన ముష్కురులను న్యాయము, చట్టము  అంటూ కాలయాపన  చేయకుండా తక్షణమే శిక్షించటం,అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ,ప్రజా సమూహాల కూడలిలో ,RAILWAY STATION,BUS STAND లలో-
లేని చోట్ల C C  కెమెరాలను  అమర్చటం, ఉన్నవాటిని  PERFECT   గా      PERFORM చేయించటం,ప్రతివొక విషయంలో PHOTO  ID  CARD ని  కంపుల్సరి చేయడం ,ఏ విషయం లోను రాజీ పడక నిజాయితిగా  వ్యవహరించడం ద్వారా కొద్దిలో కొద్దిగైన  ఈ నరమేదాన్ని ఆపు తారని  ఆశిద్దాం.

     అలాగే పౌరులమైన మనము మన వంతు  కర్తవ్యాన్ని  పాటిద్దాం! ఎలాగంటే-
             ముక్కు మొఖం తెలియని  కొత్తవారికి గదులు ఇల్లులు రెంటుకివ్వక పోవడం
             ఒకవేళ ఇస్తే  TENANTS  PARTICULARS/INFORMATION ను దగ్గర గల పోలీస్ స్టేషన్ లో  ఇవ్వటం. అలాగే LODGES వారు కూడా  .PS లలో INFORMATION ఇవ్వటం.పరిసర ప్రాంతాలను గమనిస్తూ  ACTIVE గా ఉండడం.
        
చివరిగా -గోకుల్ చాట్, లుంబిని పార్క్ తదితర బ్లాస్టులు మరియు 21 న జరిగిన బ్లాస్టులను చూసి బాధ పడుతూ పెట్టిన పోస్ట్ ఇది.(మీరూ బాధ పడి ఉంటారు. ఆ మాటకొస్తే మనందరమూ  భాధ పడుతూనే ఉన్నాము) అంతే కాని ఎరిని నొప్పించాలని కాదు. అలా ఎవరినయిన నొప్పించి ఉంటె క్షంతవ్యుణ్ణి.

                                       జై భారత్! జై భారత్!! జై జై భారత్!!!

-  

9 comments:

  1. హరి
    చాలా ఆవేదన కలిగించే విషయాన్ని కదిలించావు ఎప్పటిలాగే
    నీ question mark post తో.
    కుల మత ప్రాంతాలతో సంభంధం లేకుండా ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ స్పందించి భాద పడే సంఘటన అది.
    ఇక్కడ ఒక విషయం నా అభిప్రాయంగా చెప్పదలుచుకున్నాను.
    ఏ చిన్న విషయమైన పెద్ద విషయమైన దానికి ఒక route cause వుంటుంది.ఎలాగంటే--
    *ఒక హోటల్లో రూమ్ ఎవరికైన దొరకటం చాలా easy:నాకు డబ్బోస్తే చాలు అని అనుకునే వాడి స్వార్ధం వలన
    *terrorist చాలా సులువుగా పాస్పోర్ట్ సంపాదించడం : లంచాలు తినే ఆఫీసర్ వలన
    * ఇండియన్ కానివాడు చాలా హాప్పీగా దేశం లో తిరగొచ్చు : రాజకీయ జ్యరం పట్టుకున్న నాయకులవలన
    * హత్యలు మానభంగాలు చేసి తప్పించుకోవచ్చు : డబ్బుకోసమే వాదించే లాయర్ల వలన
    * ఎలాంటి వాడికి అయిన డ్రైవింగ్ లైసెన్స్ ఈజీ గా దొరుకుతుంది : డబ్బుకు కక్కుర్తి పడే ఏజెంట్స్ ఆఫీసర్లు వలన.
    ఇలా ఎన్నయన చెప్పుకోవచ్చు
    మనిషిలో మార్పు రానంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ప్రశాంత మనుగడ కష్టమేమో

    ReplyDelete
  2. dear sreenu,
    thanq very much for your comment.what u have expressed is cent per cent correct.
    that is why -i said "ఏ విషయం లోను రాజీ పడక నిజాయితిగా వ్యవహరించడం"
    if everybody is honest,definitely there will be change in the country.what u say.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. దీనికంతటికి మూల కారణం మనుషుల తత్త్వం మరియు ప్రవర్తనే కారణం అని నా అభిప్రాయం. అది మారితే మన దేశం లో కరప్షన్ కూడా నాశనం అవుతుంది.అన్నిటికి సర్దుకుపోవడమే మనము చేసిన తప్పు. ఏది జరిగిన కొన్ని రోజులు తిట్టుకోవడం, ప్రచారాలు చేయడం వరకే కాని తరువాత అన్ని మర్చిపోతున్నాము. ఇలా ఎప్పటినుంచో జరుగుతనే వస్తుంది.స్లో పాయిసన్ లాగా అన్నిటికి సర్దుకుపోవడం మనకు అలావాటు అయిపొయింది.నేను ఎప్పుడు చాలా తక్కువగా మాట్లాడతాను.ఎందుకంటే నేను చెప్పే రూల్స్ అండ్ రైట్స్ ఎవర్రికి నచ్చవు. ముందు రూల్స్నా, తరువాతే రైట్స్ అని చుట్టూ వున్న స్నేహితులకి ఎప్పుడు చెప్తువుంటాను. వాళ్ళు మనం ఒక్కరమే పాటిస్తే మారదు కదా అని హేళన చేస్తారు.ఇది అంతా మన దేశం యొక్క మనషుల తత్త్వం వల్లే. అలా అని నేను నా పాయింట్ అఫ్ వ్యూ మార్చుకోలేదు. మీలా ఆలోచించే వాళ్ళు మా యుగం లో చాలా మంది వుంటే బావుంటుంది. కొంతమంది వున్నా వాళ్ళకి వచ్చే రెస్పొన్సెస్ కొన్ని మాత్రమే. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ..

    ReplyDelete
    Replies
    1. నీ ఆలోచన విధానం నేనర్థం చేసుకున్నాను.నీ స్పందన కరెక్టే!
      అందుకనే ఎవరికి వారు కరెక్ట్ గా ఉండాలి అంటాను. అంటే -సత్ప్రవర్తన కలిగి,
      చేతనైతే ఇతరులకు సహాయం చేయడం, కాకపొతే కీడు చేయకుండా ఉండడం.సత్ప్రవర్తన
      అంటే నా ఉద్దేశ్యం,ఏది చేయాలనో అది చేయడం, ఏది చేయకూడదో దాన్ని చేయకపోవడం.

      Delete
  5. Thank you very much for the reply . I will follow it.

    ReplyDelete
  6. హరి గారు!
    మీ బ్లాగు రూపంలో దేశభక్తి పూరకంగా,
    భావాల్లో ఆలోచనాత్మక స్ఫోరకంగా ఉంది.
    అభినందనలు!

    ReplyDelete
  7. డాక్టర్ గారు ,
    క్రుతజ్ఞాతావందనాలు.
    మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి
    చాలా ఫాస్ట్ గా స్పందించారు, మెనీ మెనీ థాంక్స్.
    మీకు వీలున్నప్పుడు నా పోస్టులన్నీ చదవి మీ స్పందనను
    తెలియచేయగలరని ఆశిస్తూ - మీ అభిమాని హరి పొదిలి

    ReplyDelete