republic day

republicdayintelugu.jpg

Sunday 17 March 2013

.......ఇది సాధ్యమా......?

     ఈరోజు  'The Hindu' పేపర్ చదువుతూ ఉంటే  "holding quote" కనపడింది. అందులో Author 'Anuja Chouhan ' గారి quote- anti-rape law మీద- "WHY CAN'T MEN STAY INDOORS AFTER 8 PM TO STOP RAPE"

ఈ QUOTE చదివిన తరువాత  ఈ పోస్ట్ రాయాలనిపించింది. IS IT  POSSIBLE?  ఇది సాధ్యమా? అదీ మన భారతదేశంలో.మన దేశంలో అధిక శాతం/ మెజారిటీ శాతం ఉద్యగాలు చేసేది  పురుషులే! కుటుంబ పోషకులు వారే!
పితృ  స్వామ్యమున్న మనదేశం లో ఇది సాధ్యమా? అసలు  ఆ  ఊహే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
     
          ఏ రంగం తీసుకున్న అత్యధిక శాతం పురుషులే ఉద్యోగం చేస్తుంటారు.అలా ఉద్యోగం చేసే వారిలో -SHIFT SYSTEM లో పని చేసేవారు, NIGHT DUTY  కి  వెళ్ళేవారు, SHIFT DUTY  చేసుకొని ఇంటికి వెళ్ళేవారు- ఇలా ప్రతి రంగం లో పురుషులు పగలనక రాత్రిల్లనక  రాకపోకలు  సాగిస్తూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ  ఎక్కడికక్కడే ఆగిపోతే -జీవితం సాగేదేలా? అసలు అది సాధ్యమా? ఒకవేళ అలాగే  INDOORS లో ఉండిపోవాలే అనుకుందాం-DUTY HOURS అయిపోయిన తరువాత ఆ ఆ సంస్థలు వారిని అక్కడే ఎందుకు ఉండనిస్తాయి.
అలాగే షాప్స్ లో పని చేసే  పురుషుల పరిస్తితి ఏంటి? దాదాపు అన్ని షాప్ లు  రాత్రి పది గంటలకు క్లోజ్ చేస్తారు. మరి వారు ఎక్కడ ఉంటారు? ఎప్పుడో ఉదయం 9 గంటలకు షాప్ ల కొచ్చి  షాప్ లు క్లోజ్ చేసిన తరువాత  వారు
ఇంటికి పోకపోతే వారి FAMILY పరిస్తితి  ఏంటి?

           ఇక ఇంకొక ఉదాహరణ -సినిమాలు , సినిమా హాల్ల  విషయమేంటి-దాదాపు అన్ని SECOND SHOWSకు పోయే వాళ్ళంతా పురుషులే .మరి పురుషులందరూ ఎనిమిది తరువాత  INDOORS లో ఉంటే మరి వాటి పరిస్థితి ఏంటి. FIRST SHOW 9 గంటలు వదులుతారు .మరి 8 దాటి పోయింది  కాబట్టి వాళ్ళందరూ హాలు లోనేఉండిపోవలేనా? అసలు అది సాధ్యమా!

           మరొక చిన్న విషయము - FOUR WHEELER  ఉండే చాలా మంది యజమానులు DRIVERS ని   డ్యూటీ లో పెట్టుకుంటారు. అలా DRIVERS గా ఉద్యోగము చేసేవారందరూ పురుషులే. వారు జమానులను  అవసరాన్ని బట్టి  ఏ సమయములో నైనను తీసుకురావడమో,తీసుకుపోవడమో జరుగుతుంది. మరి ఆ  DRIVERS ని
డ్యూటీ కి పోకుండా ఆపగలమా? పోనీ  పురుష చ్యోదకులే లేకుండా చేద్దామనుకున్దాము. మరి స్త్రీలు  ఆ DRIVERS డ్యూటీ చేయగలరా. OKAY  చేస్తారు అనుకుందాము. ఐతే అది వారికి  COMFORTABLE జాబా? అక్కడ వారికి SAFETY AND SECURITY ఉంటుందా? ALMOST ALL యజమానులందరూ  పురుషులే కదా!
 
     ఇలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూపోతే -IT IS IMPOSSIBLE ,I  THINK. ఒకవేళ  అలా జరగాలంటే -అది జీవన ప్రక్రియనే ఆపేస్తుందేమో! THERE WILL BE STANDSTILL IN THE HUMAN LIFE.

     అంత పెద్ద రచయిత గారు  అలా QUOTE  చేయడం  సబబు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే-ఇక్కడ  ఎవరుబయట ఉండాలి ,ఎవరు  లోపల ఉండాలి  అనేది కాదు POINT.  స్త్రీలపై  పురుషుల  దృక్పధం మారాలి. స్త్రీలను  గౌరవించడం రావాలి. అది ఇంటి నుండే రావాలి. చిన్నతనము లోనే  అబ్బాయిలకు  FEMININE GENDER ఫైగౌరవ మర్యాదలు  ఉండేట్లు నేర్పాలి.GIRLS  అంటే ఆటవస్తువులు ,SEXY SYMBOLS  కాదని ,వారిని
గౌరవించటం,మర్యాదించడం  వారికి తెలియ చెప్పటం లాంటివి  ఇంటిలో నుండే మొదలవ్వాలి.అలాగనే  స్త్రీలు కూడా  ఇంట్లో  తమ కూతుర్లకి   మన సంస్కృతి, సాంప్రదాయాలని , వాటి గొప్ప తనాలని  చెబుతూ గౌరవాన్ని ఇనుమడింపజేసే , శరీరాన్ని COVER చేస్తూ ఉండే, మనకు సేఫ్టీ కలిగించే డ్రెస్ లను ధరించడం  మంచిదని వారికి నచ్చచెప్పటం  లాంటివి చేయాలి. బట్టలు హుందాగా ధరించటం (EVEN MODERN DRESSES) ఎలాగో వారికి తెలియ చెప్పాలి. ఎందుకంటే ,పంజాబీ డ్రెస్ వేసుకున్న చాలామంది అమ్మాయిలని OBSERVE  చేస్తే -వారికి చున్ని ఉంటుంది ,సంతోషమే ,కాని  అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండ గొంతుకు అతుక్కుని ఉంటుంది. అదే బాధ. ఇలా ప్రతి ఒక్కరు -ఎవెరి డ్యూటీ వారు చేస్తే  కొంతైన అత్యాచారాలను  అరికట్టవచ్చునెమో!

    ఇక ప్రభుత్వ పరంగా చూస్తె -RAPIST లకు త్వరగా శిక్ష పడేట్లు చూడాలి. అది ఏ  శిక్ష అయినను, అంటేమరణ శిక్ష గాని లేక జీవిత ఖైదు కాని. మరి మీరేమంటారు?

20 comments:

  1. మీతో పూర్తిగా ఏకీభవిస్తా౦.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. జ్యోతిర్మయి గారు,
      శుభోదయం.
      మీ faaaast స్పందనకు కృతజ్ఞుడను.

      Delete
  2. chaala baaga chepparu ... it's impossible !

    ReplyDelete
    Replies
    1. thanq raa !so u r following the blog.

      why don't u start a blog?

      Delete
  3. హరి గారు బాగున్నారా?

    Author 'ఆనుజ ఛౌహన్ ' గారి quote quote- anti-rape law మీద- "WHY CAN'T MEN STAY INDOORS AFTER 8 PM TO STOP RAPE"

    అనుజా చౌహాన్ అలా quote చెయ్యడం సబబేనా అంటే definetly కాదు. అది సమస్యకి ఏ రకంగానూ పరిష్కారం కాదు.
    అయితే నాకు ఆవిడ quote చేసిన దానికి, మీరు ఈ పోస్ట్ ఎండ్ చేసిన దానికి పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు.

    స్త్రీలు తమకి సేఫ్టి కలిగించే దుస్తులు ధరించాలి... Interesting...ఆఖరికి పంజాబి డ్రెస్స్ లో కూడా మీకు అభ్యతరం తోచింది...
    చున్ని ఎక్కడ ఉండాలో చెపుతున్నారు.అంటే,బురఖా వేసుకోమంటే బాగుంటుంది కదండి..అసలు గొడవే లేదు.
    స్త్రీల వస్త్రధారణ మారాలి అన్న ఈ పొయింట్ నాకు చాలా అవమానకరం అనిపిస్తుంది ఎక్కడన్నా చదివినప్పుడు. I agree one needs to dress decently whether it is a man or a woman , but raping a woman should have nothing to do with how they dress. హుందాగా చీర కట్టుకున్న అమ్మాయిలు, రేపులకు గురయ్యింది తక్కువ అని ఎక్కడన్నా statistics publish చేసారాండి?

    ఈ రేప్ సమస్యకి పరిస్కారం అది ఎంతను కాదు.అది తప్పు అని తెలిసినా,తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకుంటామానే ధైర్యం.ఎప్పుడైతే చిన్న తప్పు చేసినా కట్టిన శిక్ష ఉంటుంది అన్న భయ్యం ఏర్పడుతుందో , అక్కడ ఇలాంటివి జరగవు. కొడుకలకి ఒక నీతి, కూతురికి ఒక నీతీ చెప్పే విధంగా ఆడవారు పిల్లలను పెంచటం మానాలి.






    ReplyDelete
    Replies
    1. థాంక్సండి జలతారువెన్నెల గారు,
      బాగున్నానండి!
      సెలవు తరువాత మీ పునర్దర్శనం సంతోష దాయకం.

      మీ స్పందనకు చాలా చాలా థాంక్సండి.వారానికొకసారి నేను హైదరాబాదు లో ఉంటానండి. ఈరోజే వచ్చానండి.మీ స్పందన చూసి వెంటనేRESPOND అవుతున్నాను.

      మీ స్పందన చూసి ఒకింత విశ్మయం చెందానండి.స్త్రీలంటే నాకు అపారమైన గౌరవముందండి.నా POSTINGS లో ఎక్కడైనా అగౌరంగా వ్రాసి ఉంటే చూపించండి అసలు, స్త్రీని నేను 'ఆడది' అనే సంభోదిన్చనండి.ఎవరైనా అంటే నేను ఖండించే వాన్ని. V V N S B R
      రామారావు గారు DVS కర్ణలో 'ఒక్క ఆడది నన్ను చూసి పరిహసించుటయా',అలాగనే VISHU గారి సినిమా ఆడదే ఆధారం -ఈ రెండు చోట్ల స్త్రీ అని వాడి ఉంటే ఏంటో బాగుండేది కదా అని అప్పుడే ఫీలయ్యా. SO అది నా NATURE.

      .ఆఖరికి పంజాబి డ్రెస్స్ లో కూడా మీకు అభ్యతరం తోచింది...
      చున్ని ఎక్కడ ఉండాలో చెపుతున్నారు.అంటే,బురఖా వేసుకోమంటే బాగుంటుంది కదండి..అసలు గొడవే లేదు

      P D పై నా అభ్యంతరం ఎక్కెడుంది? అసలు నేనెందుకు అభ్యంతరము పెడతాను.ఎందుకు పెట్టాలి? నా అభ్యంతరం/నిరభ్యంతరం లతో
      పనేముంది.P D లు గాని, జీన్స్ గాని,ఆ మాటకొస్తే ఏ MODERN DRESS అయిన వేసుకోవద్దని/వేసుకోకూడదని నేననలేదే.ఎ DRESS అయిన హుందాగా /DECENT గా ఉండాలనేదే నా అభిప్రాయము.కావాలంటే మీరు నా 'MY DRESS IS NOT A YES'
      మరియు 'వేషధారణ' పోస్టింగ్స్ ను చదవండి. నా అభిప్రాయమేంటో తెలుస్తుంది.

      ఇక CHUNNI Vషయానికొస్తే-ఎ పనికైనా/దేనికైనా ఓ PURPOSE ఉంటుంది కదా!SO ఆ విషయాన్ని విశదపరిచాను. ఇందులో తప్పేమీ లేదే. WESTERN CULTURE లో కొట్టుకుపోతూనే మన సంప్రదాయాలను కూడా గౌరవిన్చాలనేది నా ఉద్దేశ్యం.చున్నీని ధరించేది
      STYLE/FASHION కోసం కాదు కదా!YES, CERTAINLY IT IS NOT FOR STYLE OR FASHION. ఎలాగూ వేసుకుంటున్నాము కాబట్టి మంచిగ వేసుకుంటే మంచిది కదా! ఇందులో తప్పేముందో నా కర్థం కావడం లేదు. పోనీ మీరేమి చెప్పదలుచుకున్నారు.అసలు చున్నీలే వేసుకోవద్దని చెబుతారా.JEANS T SHIRTS వేసుకునే అమ్మాయిలు ఎ ఆచ్చాదన లేకుండా ధరిస్తున్నారు కదా?మరి ఇక్కడ మంచిగా వేసుకోవాలనేది ఉద్భవించదు.మరి P D విషయానికొస్తే -IT IS COMBINATION OF CHUNNI.ఇక్కడకూడా చున్ని వేసుకోకపోతే -మంచిగా వేసుకోవాలనేది ఇక్కడకూడా ఉద్భవించదు.బురఖాలు వేసుకోండని నేనెక్కడా చెప్పలేదే?

      ఇక-స్త్రీల వేషధారణ మారాలి అని నేనెప్పుడు నా పోస్ట్లలో పెట్టలేదు.మీరు మరొక సారి నా పోస్టింగ్ 'వేషధారణ' చదవాలని నా మనవి.

      హుందాగా చీర కట్టుకున్న అమ్మాయిలు, రేపులకు గురయ్యింది తక్కువ అని ఎక్కడన్నా statistics publish చేసారాండి?

      MODERN DRESS వేసుకున్న వారు ఎక్కువుగా,SAREES ధరించిన వారు తక్కువగా బలాత్కారం చేయబడుతున్నారు అని నేనలేదే.

      but raping a woman should have nothing to do with how they dress-YES I TOO AGREE THIS.
      ఈ విషయాన్నే " ఎవరుబయట ఉండాలి ,ఎవరు లోపల ఉండాలి అనేది కాదు POINT. స్త్రీలపై పురుషుల దృక్పధం మారాలి". MEN MINDSET మారాలని చెప్పా కదా!

      కొడుకలకి ఒక నీతి, కూతురికి ఒక నీతీ చెప్పే విధంగా ఆడవారు పిల్లలను పెంచటం మానాలి. YES ఈ విషయాన్నే నేను ఇంకో విధంగా -'మంచి' అనే విషయాన్ని చెప్పటం ఇంట్లోనుండే చిన్నప్పటినుంచే రావాలని పై పోస్టింగ్ లోనే వ్రాసాను.సో ఇప్పటికైనా మీరు
      నన్నర్థం చేసుకుంటారనుకుంటాను.

      జలతారువెన్నెల గారు ఇంకొక విషయం- ఈరోజు పేపర్ లో NEWS-దక్షిణ కొరియా ప్రభుత్వం వారు 'SKIRTS' ధరించరాదని చట్టం
      ప్రవేశ పెట్టారు.దీన్ని మీరేమంటారు?

      Delete
    2. కొద్దిగా లేట్ గా చూసాను మీ స్పందన.
      హరిగారు, మీకు స్త్రీల మీద గౌరవం లేదు అని నేను అనుకోలేదు.అనుకోను కూడా.
      మీ పోస్ట్ లన్ని సామాజిక సృహ కలిగినవి, నాకు నచ్చేవి.
      ఈ మధ్య కాలం లో చాలా అర్టికల్స్ లో ఈ రేప్ గురించి ప్రస్తావించినప్పుడల్లా స్త్రీల వస్త్రధారణ గురించి తప్పనిసరిగా చర్చించడం ఒక అంశం గా మారింది.అది నచ్చక, మీరు కూడా ఈ పోస్ట్ లో అది ఒక ముఖ్యమైన పాయింట్ గా తీసుకుని రాయడాన్ని నేను వ్యతిరేకించాను.అంతే కాని ఇంతకు మించి నాకు మరే ఉద్దేశము లేదు.

      "NEWS-దక్షిణ కొరియా ప్రభుత్వం వారు 'SKIRTS' ధరించరాదని చట్టం
      ప్రవేశ పెట్టారు."
      If men aren't to be held responsible for their own urges and instead blame women for their clothing----No comments!!!

      Delete



  4. అనుజా చౌహాన్ వాదన కోసం అలా రాసిఉండవచ్చును.ఆ మాట అలాఉంచితే, రేప్' అన్నది ఏసందర్భంలోను సమర్థించరానిది.ఆఖరికి ఒక వేశ్య నైనా ఆమె ఇష్టంలేక 'బలవంతం చెయ్యకూడదు.ఇక స్త్రీలవస్త్ర ధారణగురించి;మగవారిలాగే అది వారి ఇష్టం.జీన్స్.షర్టు వేసుకుంటే తప్పేమిటి ? మగ ఐనా ఆడ ఐనా పబ్లిక్ లో వచ్చినప్పుడు కాస్త డీసెంట్ గా దుస్తులు ధరించాలి .అంతే. ఇక sporTs ,swimmingki,పొట్టి దుస్తులు వేసుకోవాలి కదా.పల్లెటూళ్ళలో చీరలు కట్టుకున్న స్త్రీలపై అత్యాచారాలు జరగడం లేదా? క్రిమినల్స్ చేసే దురంతాలకు కఠినశిక్షలు పడవలసిందే.
    ఇప్పటీకైనా ప్రభుత్వం లోక్ సభలో బిల్లు తెస్తున్నందుకు మంచిదే.కాని దాన్ని పోలీసు యంత్రాంగం,న్యఆయస్థానాలు త్వరితంగా అమలు చేస్తాయని ఆశిద్దాము.

    ReplyDelete
    Replies
    1. sir,first of all let me convey my thanks to you.ఎందుకంటే,మీరు నా బ్లాగ్ ను visit చేసినందుకు,మరియు
      స్పందించినందుకు.

      సర్,వస్త్రధారణ అనేది -ఎవరి ఇష్టం వాళ్ళది.జీన్స్ షర్ట్స్ వేసుకుంటే తప్పని నేననలేదండి.
      modern dress వేసుకున్న సంప్రదాయ వస్త్రధారణ అయిన సరే హుందాగా ఉండాలనేది నా ఉద్దేశ్యం.దీనికై, దయవుంచి మీరు నా postings- MY DRESS IS NOT A YES మరియు 'వేషధారణ'చదవగలరు.

      ఇక SPORTS DRESS విషయానికి వస్తే -TENNIS PLAYERS -GENTS ఎంచక్కా SHORTS వేసుకుని ఆడితే,మరి లేడీస్ కూడా SHORTS వేసుకోవచ్చుగా! మరి వారెందుకు SKIRTS మరీ పొట్టివి వేసుకుంటారు?

      చీరలు ధరించిన స్త్రీలపై బలత్కారములు జరుగుట లేదని ఎవరు చెప్పారు?
      మగవాడి మైండ్సెట్ మారాలనేది న ఉద్దేశ్యం.

      సర్ నా POSTINGS అన్ని చదివి మీ స్పందన తెలియ చేయాలని మనవి.
      మరొక్క సరి ధన్యవాదాలతో

      Delete
  5. హరి గారూ, మీ స్పందన మీ విష్లేషణా అద్భుతంగా ఉంది, మగవారిని ఇంట్లో బందించటమే పరిష్కారం కాదు, వ్యవస్తలో మార్పు రావాలి, మంచి చెడూ తెలియాలి సిక్షలు బలమైనవిగా ఉండాలి. అభినందనలు మీ పోస్ట్ చా బాగుంది

    ReplyDelete
    Replies
    1. thanks అండి ఫాతిమా గారు
      sorry for the late response.పోస్ట్ నచ్చినందుకు.
      ఎల్లప్పుడు మీ encouragement ను ఆశిస్తూ-హరి

      Delete
    2. Meeraju Fathima gaaroo!

      Ha ha.. "మగవారిని ఇంట్లో బందించటమే పరిష్కారం కాదు" తో మీ ఉద్దేశ్యం? స్త్ర్రీలని రోడ్లమీద తిరగమనా??

      వ్యవస్థలో పూర్తి మార్పు రాదని మనందరికీ తెలుసు.

      శిక్షలు బలమైనవి అయినంతమాత్రాన దారుణాలు ఆగుతాయనుకోవడం మన భ్రమే.

      దారుణాలు తగ్గించవచ్చునేమోగానీ నిర్మూలించడం అసాధ్యం.

      అయితే మన హద్దుల్లో మనం ఉండాలి. అప్పుడే సరియైన ఫలితాలు చూడగలం.

      ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. తప్పులు ఉంటే క్షమించగలరు.

      Delete
  6. హరి గారు .. మీ ఈ పోస్ట్ ఆలస్యంగా చదివాను. మీ అభిప్రాయం సూటిగా నిక్కచ్చిగా ఉంది. నాకు నచ్చింది

    స్త్రీల వస్త్ర ధారణ పై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడల్లా నేను అనుకుంటాను అదొక ముఖ్య కారణంగా చూపబడుతుంది అని

    కానీ అదే సమాజం లో అదే సమయం లో చాలా మంది మగ వారు తారస పడతారు మరి వారందరూ విజ్ఞత తో వ్యవహరించినప్ప్పుడు అత్యాచారం చేయడానికి లేదా చేసిన వ్యక్తి or అలాంటి వారి కొందరికే ఎందుకు చిత్త ప్రవ్రుత్తి కలగాలి ?
    నెపం స్త్రీల వస్త్ర ధారణ పై వేయకుండా మిగతా విషయాలపై దృష్టి పెడితే బావుంటుంది అని నా అభిప్రాయం

    అలాగే ఆడపిల్లలు ప్రొవొకింగ్ గా వస్త్రధారణ చేసుకోవడం ఎందుకు అన్నది కూడా నా ప్రశ్నే!

    ReplyDelete
  7. వనజవనమాలి గారు,
    థాంక్స్ అండి.
    మీ కామెంట్ రాలేదే అని ఎదురు చూస్తున్నాను.
    ఆలస్యంగా చదివినను స్పందించినందుకు థాంక్స్.

    ' అలాంటి వారి కొందరికే ఎందుకు చిత్త ప్రవ్రుత్తి కలగాలి ?'

    అందరూ ఒకలాగే ఉండాలని ఎక్కడా లేదు కదా అండి.
    అలా ఉండాలని ఆశించడం/ఊహించడం అత్యాశే అవుతుంది. ఈ విషయమే నేను "my dress is not a yes" అనే పోస్టింగ్ లో
    వ్రాసానండి.అమ్మాయిలందరూ proviking గా dress వేసుకోరు కదండి.ప్రతి దానిలో రకరకాల వ్యక్తులు ఉంటారండి.


    నెపం స్త్రీల వస్త్ర ధారణ పై వేయకుండా మిగతా విషయాలపై దృష్టి పెడితే బావుంటుంది అని నా అభిప్రాయం
    నేనేమి నెపం వేయలేదండి. వేసే a dress అయిన -modern dress అయిన/సాంప్రదాయ వస్త్రధారణ అయిన హుందాగా
    ఉంటె మంచిది కదా అని నా ఉద్దేశ్యం.

    అలాగే ఆడపిల్లలు ప్రొవొకింగ్ గా వస్త్రధారణ చేసుకోవడం ఎందుకు అన్నది కూడా నా ప్రశ్నే!
    మీలాగే అందరూ ఇలాంటి ప్రశ్నే వేసుకుంటే అందర్నీ హుందా dress లో చూడచ్చేమో!
    మరొక సారి కృతజ్ఞలతో-హరి

    ReplyDelete
  8. మాస్టారు మీతో ఏకిభవిస్తున్నాను ...

    ReplyDelete
    Replies
    1. satya garu
      mee spandanaku thanks.out of station eroje chusanu marrokka sari danyavadamulatho hari

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. సభకు నమస్కారం!!

      1) నాకెందుకో ఆ వార్త satirical గా అనిపించింది. ఆ వార్త రాసినవారు వివాదానికి తావివ్వకుండా మహిళల చేత ఆలోచింపచెయ్యాలనే ఉద్దేశ్యంతో రాసి ఉండవచ్చును. ఆవార్త మహిళలను ఉద్దేశించి రాసినదేనని నా అభిప్రాయము. కాబట్టి 8 తర్వాత ఇంట్లో ఉండాల్సింది ఎవరో మనకి ఇట్టే తెలిసిపోతుంది.
      2) కొందరు మగాళ్ళు మృగాళ్ళు అని తెలిసికూడా, ఇంకా నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి, రోడ్లమీద తిరుగుతాను అంటే కష్టం కదా.. ఇంట్లో కూర్చున్నవారికే రక్షణ లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వస్తే, అప్పుడు మనం ఏమీ చెయ్యలేము.

      3) పూజింపబడాల్సిన స్త్రీ పూజింపతగినదిగా ఉండాలిగానీ, అవివేకంగా ఉండకూడదని నా అభిప్రాయము.


      4) ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. తప్పులు ఉంటే క్షమించగలరు.

      Delete