republic day

republicdayintelugu.jpg

Saturday, 19 May 2012

ఎక్కడైనా ఉందా.......

ఏంటి ఎక్కడైనా ఉండేది? అని అనుకుంటున్నారా! అదే ,అక్కడకే వస్తున్నా!
అసలు  మన  దేశమంటే  పుణ్యభూమి అనే కదా !అందుకే కదా 
,పుణ్యభూమి నా దేశం నమో! నమామీ! అనే పాటకూడా వచ్చింది.  

అయితే ఇలాంటి పుణ్య భూమిని పాపభూమిగా మారటానికి/మార్చటానికి
 ఎన్నిరకాలైన  పైశాచిక  కార్యక్రమాలు  చేయాలనో చేసారు, చేస్తూనే  ఉన్నారు. 

లంచగొండి తనం-ఓ భయంకరమైన  మహమ్మారి.దాన్ని నాశనం చేయలేకపోయామ్,ఎందుకంటే -IT PREVAILS EVERY WHERE, అన్నారు. IT CAN'T BE ERADICATED -అన్నారు.

మరి  దీని కంటే ఇంకా భయంకరమైన వ్యాధి దేశాన్ని పట్టి పీడిస్తోంది. నిర్వీర్యం చేస్తోంది.అదే  అదే -కలుషితం, కలుషితం.కొందరిలో నరనరాన జీర్ణించుకుపోయి భావి భారతాన్ని చిద్రం చేస్తోంది.

కలుషితం కలుషితం ఎక్కడబడితే  అక్కడ కలుషితం-
తినే తిండిలో కలుషితం,
త్రాగే నీరులో కలుషితం,
పాలల్లో కలుషితం,
పానీయాల్లో కలుషితం,
మందుల్లో కలుషితం,
"మందులో" కలుషితం,
ఎరువుల్లో కలుషితం,
గింజల్లో కలుషితం,
పప్పుల్లో కలుషితం,
నూనెల్లో కలుషితం,

మానవ సంబంధాలు కలుషితం,
అనుబందాలు,అనురాగాలు కలుషితం,
ప్రేమలు,అభిమానాలు కలుషితం,
పలకరింపులు,తియ్యని మాటలు కలుషితం,

ఆలయాలు,విద్యాలయాలు,వైద్యాలయాలు,
ఆటల శిక్షణాలయాలు,కార్పోరేట్ సంస్తలు
ఇలా ప్రతిఒకటీ  ' కలుషితాలే' ,  "కలుషితాలయాలే!!

  " కాదేది కవితకనర్హం" అని శ్రీ శ్రీ  గారన్నట్లు.
కాదేది కలుషితాని కనర్హం,అని అనుకోవాల్సి వస్తోంది.,
ఎందుకంటే,నేను (ఆ మాటకొస్తే  మనమందరం)కలలో కూడా ఊహించని
ఓ -కలుషితం-మొన్ననే టీవీ లో చూసానండి.అప్పటి నుండి  ఈ విషయం పై 
పోస్ట్ పెట్టాలని ,మీతో పంచుకోవాలని, అనుకున్నాను,యిప్పడు పెట్టానండి.

విషయానికొస్తే -అపుడెపుడో పేపర్లో చదివానండి-ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల బదులుబినామి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారని. ఇదే భరించరాని తప్పు. ప్రభుత్వపు ఫైళ్ళను ఇతరులు చూడటం 
పెద్ద నేరము.అరె  GOVT. ఏమి చేస్తోందని  అప్పుడే ఆశ్చర్య పడ్డాము. కాని అక్కడ ఏ ప్రాణికి ఆపద ఏమీ లేదు.

కాని మొన్నటీవిలో వచ్చిన  విషయం-గాంధీ ఆసుపత్రిలో రోగులకు E C G TEST చేసేది ఎవరో తెలుసా?
TECHNICALLY  QUALIFIED AND LICENSED LAB TECHNICIANS కాదు.అనామకులు. ఏ స్కిల్లూ లేని UNSKILLED SPURIOUS YOUTH. వీరు....   అక్కడ టెస్ట్లు లు చేసేవారు. వీరి టెస్టుల్లో ఏదైనా  లోపంజరిగితే. అ రోగుల గతేంటి? వారి జీవితాలకు  గ్యారంటీ ఎవరు?ఇదేంటని  మీడియా వాళ్ళు అడిగితే వారిపై దౌర్జన్యాలు.అసలేంటి మన దౌర్భాగ్యం. మందుల్లో, సూదుల్లోనే  ఈ కలుషిత మహమ్మారి ఉందనుకుంటేచివరికి ఆసుపత్రి ఉద్యోగుల్లో కూడా కలుషిత ఉద్యోగులు ఉన్నారు. ఇది  ఆందోళన చెందవలసిన పరిస్తితే! ఇది ఇలాగే కొనసాగితే 
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు పోరేమో.లేక భయపపడతారేమో!


చివరికి చంటి పిల్లలు త్రాగే పాలల్లో కూడా  ఈ కలుషితం దోబూచులాడుతోంది. అందకే అంటున్నాను ,
"ఎక్కడైనా ఉందా ?! కలుషితం  లేనిది" అని.
ఒకవేళ  ఉంటే గింటే అదొక్క తల్లిప్రేమలోనే అనుకుంటా!తల్లి లోనే అనుకుంటా!!







Saturday, 12 May 2012

అమ్మా.........నీకు మరో పేరు..............

  అమ్మ.........

ఓ త్యాగం                                                      
ఓ  దైవం
ఓ  సహనం
ఓ  ఔషదం
ఓ  ప్రపంచం
ఓ  అద్భుతం
ఓ  అమృతం
ఓ  తియ్యదన
ఓ  దేవత
ఓ  ఫ్రెండ్
ఓ  గైడ్
ఓ శక్తి
ఓ  ఆశ
ఓ  పాట
ఓ  బడి
ఓ  కోచ్
ఓ  ప్రేమ
ఓ  ఆలన
ఓ  వెలుగు
ఓ  జాబిలి
ఓ కరుణామయి
ఓ మానవతామూర్తి
ఓ ఘంటసాల పాట
ఓ  తనివితీరనిపాట
ఓ  తిరుగులేని మాట
ఓ  వెలకట్టలేనిది
ఓ  విలువ కట్టలేనిది
ఓ  అమూల్యమైనది
             అసలు  అమ్మంటే,  WHAT  WHAT, WHAT NOT, EVERY THING, SHE IS EVERY THING.
ప్రపంచములో ఏదైనా కొనవచ్చును. అమ్మను కొనలేము కదా?!  అలాంటి  అమ్మను  మొన్నామద్య్హ వరంగల్
 దగ్గర ఓ  విలేజ్ లో UNEDUCATED SONS & DAUGHTER  కలసి రోడ్ ప్రక్కన వదిలి వెళ్ళిపోయారు.
మరి ఇక్కడో-సిటీలో మాయింటి ప్రక్కన ఓ EDUCATED ILLITERATE SONS తమతల్లి ఒక్కత్తినే  బాడుగ ఇంట్లో వుంచి కార్లల్లో వచ్చి చూసిపోతూ ఉంటారు,కొడుకులు, మనవల్లు,మనవరాండ్రు.
ఇక OLD AGE HOMES లో ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో లెక్కే లేదు. మరి అక్కడ శ్రీమతులకు అమ్మ కుదరక వేరే ఇంట్లో  పెట్టాల్సి వచ్చిందేమో! మరి అక్కడ స్త్రీలే కదా! అమ్మలే కదా! వనజ వనమాలి గారి లాంటి కోడళ్ళు ఉంటే దేశంలో  అత్తమ్మలందరూ ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారు కదా! జోహార్లండి మీకువనజవనమాలి గారు.
        ఉదయం లేవగానే  స్నానాలుచేసి, శుచి సుభ్రతతో దేవుళ్ళకు పూజలు చేసే సోదరులకు, సోదరీమణులకుఅమ్మలకు,అయ్యలకు,పాపల్లకు,పిల్లలకు నా యొక్క విన్నపము-ఉదయము లేవగానే మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి మీ దైనందిన కార్యక్రమాలు చూసుకోవాలని నా కోరిక.(మీరనవచ్చు-ఏంటండి హరి గారు మీరు పాటించారా అని !చదువుకొనే రోజుల్లో  పాటించానండి.అయితే తరువాత నాతల్లిదంద్రులను నేనుకోల్పోయానండి.)
     సోదరులార !బయట జరిగే అన్యాయాలను, అక్రమాలను -మనము ఏమీ చేయలేము.కాని మన తల్లి దండ్రులనుచూసుకోవడమనేది , మన చేతుల్లోనే ఉంది, ఆ అజమాయిషి మనదే, కాబట్టి అమ్మా నాన్నలను  చూసుకోండి!
       అమ్మ గురించి ఎప్పటినుండో రాయాలనుకుంటున్న నేను శ్రీను తపన చదివి ఈ టపా పెట్టాను. నాకు వర్నించడాలు, కవిత్వాలు,రచనలు రావు.ఏదో వ్యవహారిక బాషలో అమ్మగురించి  రాయాలనిపించింది,రాసాను.
        చివరిగా ఒక్క మాట-అమ్మకు మరో పేరు త్యాగము  అని నా ఉద్దేశ్యం. మరి మీదో!?

Thursday, 26 April 2012

ఎక్కడుంది లోపం? .............ఎవరు భాధ్యులు?


SENIOR INTER RESULTS వచ్చాయి!
       Physics లో 31 శాతం మాత్రమే పాసయ్యారు.మరి మిగాతవారు ఎందుకు ఫెయిలయ్యారు? వీరందరూ  చదువర్లు కారా?   క్లవర్   స్టూడెంట్స్ కాకపోయిన ,average, above average ఉండరా?మరి ఇంత ఎక్కువ శాతం fail కావటానికి గల కారణాలేమిటి?
                          విధ్యా ప్రమాణాలు పడిపోవడమా?
                          విద్యార్థుల్లో ఆ ZEAL లేకపోవటమా?
                          ప్రశ్నాపత్రాలు తయారుచేసిన వారి భాద్యతారాహిత్యమా?
                         గుడ్డినిద్రపోయే  ప్రభుత్వమా? లేక
                         సోకాల్డ్  కార్పోరేట్ విద్యాసంస్థలా?
విద్యార్థులేమో non  syllabi questions ఇచ్చారని,ప్రభుత్వమేమో ఎక్కువ ప్రశ్నలు  SYLLABI లో ఉన్నవే ఇచ్చామనిSTATEMENTS యిస్తున్నారు
         
    అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పేది చూస్తే సిగ్గేస్తుంది,నవ్వొస్తుంది.,కోపమూ వస్తుంది. ఎందుకంటే -ఎక్కువ ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇచ్చామని చెప్పడం. ఎక్కువ ఇవ్వడమేమిటి (అప్పటికేదో మెహర్బానీచేసినట్లు), అసలు అన్ని ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇవ్వాలి కదా!?


              ఇక  స్టూడెంట్స్  విసయానికొస్తాం-వీళ్ళు  SYLLABI లో ఉన్న ఏ ప్రశ్నైన రాయాలి కదా!? అలా రాయాలంటే మొత్తం  SYLLABI  చదివుండాలి/నేర్చుకునుండాలి. SYLLABI లో ఏ ప్రశ్న ఇచ్చిన  రాయకలిగి ఉండాలి.ఎందుకంటే కొన్ని QUESTIONS  OUT OF SYLLABI  ఉన్నప్పటికీ  మిగతా  ప్రశ్నలు రాస్తే  కనీసం
పాస్ మార్కులోస్తాయి కదా! SO, ఇక్కడ స్టూడెంట్స్  మొత్తం SYLLABI చదవకుండ ఏదో కొంతమేరకే చదివుంటారనేది జగమెరిగిన సత్యం.(ఇప్పుడున్నటువంటి సినారియోలో వారిని సిలబై అంతా చదవమనడం/నేర్చుకోమనడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి టైము సరిపోవడం లేదు. ఉన్న టైమంతా-SMS లకు,
సెల్లులకు, సినిమాలకు,BOY/GIRL FRIENDS కు మరియు ముఖ పొత్తము (అదేనండి FACE BOOK) లకే
సరిపోతుంది)
   
                  ఇక విద్యాసంస్థల విషయానికొస్తే- ప్రభుత్వ సంస్థలను వదిలేద్దాం(అవి ఉన్న లేనట్లే).
ఇక CORPORATE INSTITUTIONS-వేలకు వేలు ఫీజు తీసుకొని తమ వ్యాపారాలను (విద్యా  వ్యాపారం)వృద్ధి
చేసుకుంటున్నారే గాని ,అసలు వీళ్ళు విద్య నేర్పుతున్నారా!? ఎక్కువ శాతం ఉన్న AVERAGE, ABOVE AVERAGE STUDENTS ల ఫీజులతో అతి తక్కువ ఉన్న బ్రిలియంట్స్ కు పట్టం కడుతున్నారు, ఇతర విద్యార్థులను పట్టించుకోకుండా .


        సో, మొత్తం మనందరిదగ్గర లోపం ఉంది. మనందరం భాద్యులమే!


PERFECT QUESTION PAPER తయారుచేయని వారిని ప్రభుత్వం పట్టిచ్చుకోదు/శిక్షించదు.
వేలకువేలు ఫీజులు కడతాం,వేలు పోసి అరచేయి మహమ్మారిని కొనిస్తాం, కాని పర్యవేక్షణ ఉండదు
లక్షలు పెట్టి  ప్రభుత్వాన్ని కొంటారు, ADS గుమ్మరించి మనలను  బుట్టలో వేసుకుంటారు,కాని  చదువు చెప్పరు
ఇదీ నేటి దుస్థితి. మరి మనము ఏమీ చేయలేమా ...?మీరే చెప్పండి!!




     
       










     


                

Thursday, 22 March 2012

తెలుగు సంవత్సరాది శుభాకంక్షలు

                               అంతర్జాల చదువరులకు "ఉగాది శుభాకంక్షలు"

యాగాలు చేస్తే ..........వస్తుందా!?

K C R  గారు  తెలంగాణ  రాష్ట్రం  కోసం  ఎపుడు  పడితే  అప్పుడు "యాగాలు" చేయిస్త్తుంటారు..
 యాగాలు చేస్తే  రాష్ట్రల్లోస్తాయా?!!! (మంత్రాలకు  చింతకాయలు రాలతాయా)


          గాంధీ గారు  యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చారా?
          రష్యన్ విప్లవం యాగాలతో వచ్చిందా!
          జార్జ్ వాషింగ్టన్ యాగాలతో  అమెరికాకు independence తెచ్చాడా!!


K C R అంటే   కాదు,  చెయ్యలేడు,  రాదు! అని చెప్పుకోవలసి వస్తుందేమో!
  ఎందుకంటే గత పదేండ్ల నుండి మనము గమనించినట్లయితే ,ఆయనకు  తెలంగాణా  రాష్ట్రవతరణము  మీద     ఇంటరెస్ట లేదోమో అనిపిస్తుంది.ఏదో ఎలక్షన్లప్పుడో,తెలంగాణా ప్రజలు తనను మరచిపోతునారేమో అని                     అనిపించినపుడో  అలా ప్రజల్లోకొచ్చి,బూతులతోకూడిన  ఉపన్యసాలివ్వడము,ప్రజలను రెచ్చకొట్టడము తప్ప  రాష్ట్ర   సాధన కోసం ఈ దశాబ్ద కాలంలో అయన చేసింది ఏమీ లేదు.
 ఈ దశాబ్ద కాలంలో ఒరిగిందేమైనఉందంటే-1.తెలంగాణ భవన నిర్మితం  
                                                             2. కూతురికి తెరాస లో పదవి
                                                              3 .కుమారునికి  MLA   పదవి
                                                              4.  మేనల్లుడికి  MLA  పదవి
                                                              5 .తన ఆస్తుల  పెరుగుదల
ఇవన్ని పచ్చి నిజాలు,నిస్టుర సత్యాలు.ఈ ఉద్యమము ప్రారంభమునుండి   ఇప్పటివరకు ఏ లాభము పొందని (ఈ ఉద్యమము ద్వారా)ఎంతోమంది అమాయకులు, అమాయక విద్యార్థులు ప్రాణ త్యాగం చేసారు. వారికి ఒరిగిందేమిటి?కేవలం వారి ఫోటోలకు పూలదండలు తప్పితే?
         గొప్పలు చెప్పుకొనే  ఈ తెరాస నాయకులు అందరు ప్రాణాలర్పించిన
వారి కుటుంబాలకు చేసిన మేలేమిటి? "తమబిడ్డలు చదువుకొని అభివ్రుద్దికొచ్చి తమ కస్టాలు తీర్చి తమ జీవితాలనుబాగుపరుస్తారులే అని కళలు కన్న ఆ పేద ,అమాయకుల తల్లిదండ్రుల ఆవేదనను తీర్చేదెవరు?" ఇన్నిసార్లు ఉపఎన్నికలోచ్చాయికదా! ఒక్క నాయకుడైన ఆ త్యాగధనుల తల్లిదండ్రులకుగాని బంధువులకుగాని "టిక్కెట్లిచ్చారా?
       నాయకులందరూ  సత్తాలేని  రాజీనామాలిచ్చి త్యాగం చేసాం త్యాగం చేసాం అంటున్నారు. ఏంటి వీరి త్యాగం.
నా దృష్టిలో త్యాగం అంటే -రా.నా ఇచ్చినవాళ్ళు తెలంగాణా సాధించేవరకు మల్లీపోటీ చేయకూడదు.ఏ రాజకీయ పదవి స్వీకరించకూడదు.
ఇక KC R గారి  తె. రా.సాధనపట్ల గల చిత్తశుద్దిని శంకించ వలసి వస్తోంది. ఎందుకంటే గత పదేండ్లలో జరిగినఉద్యమాలలో ఆయన ఏరోజు ముందుండి LEAD  చేసిన దాఖలాల్లు లేవు. నాయకుడంటే  ఏలే వుండాలి?
సచ్చీలత కలిగి, ఏ దురలవాట్లులేకుండా  ప్రతిక్షణం ప్రజలకోసం పరితపించేవాడై ఉండాలి.అన్నీ తానే అయి ముందుండి నడిపించాలి.కాని  మన KCR  ఎక్కడుంటాడో తెలియదు .ఉద్యమము భయంకరంగా సాగుతుంటుంది.కాని ఈయన DELHI లో ప్రత్యక్షమవుతాడు. అక్కడ కెందుకెల్లాడో ఎవరికి తెలియదు.తనూ చెప్పడు.
       అసలు మొన్న జరిగిన సకల జనుల సమ్మె ఏంతో ఉదృతంగా జరుగుతూ ఉండింది. ఇంకో పది రోజులో,పదిహేను రోజులో జరిగితే ఖచ్చితంగా కేంద్రము దిగివస్తుంది లే అని అందరూ అనుకుంటున్న సమయం లో తుస్సుమనిపించేసారు. అసలు ఎవర్ని అడిగి సమ్మెను విరమించుకున్నారో ఆ చతుష్టయమునకే తెలియాలి.
      ఇంకొక విషయమేమంటే కెసిఆర్ గారు చెప్పే ఇంకో సులభమైన మాట-ఏ  పండగైన రానివ్వండి,"ఈ పండుగనుNEXTYEAR "తెలంగాణా రాష్ట్రంలో" జరుపుకుంటామని. ఇలా అన్ని అబద్దాలు చెప్తూ ,అమాయకులైన తెలంగాణాప్రజలను మోసం చేయడమే ,దగా చేయడమే ,వంచన చేయడమే అయన వ్రుత్తి,ప్రవ్రుత్తి.
     తెలంగాణా అనే విషయం కేంద్రం చేతిలో ఉందని ,ఇటలి ఇడియట్  "హస్తం"లో ఉందని చిన్న పిల్లోడికి కూడాతెలుసనే విషయం KCR కు కూడా తెలియందేమికాదు. అయినప్పటికీ అయన తెలుగు వారిని, తెలంగాణ వాదులను,జన్మతః తెలంగాణ వారిని(వారు తెరాస వారు కాకపోతే) తిడతాడు,తిట్టిస్తాడు,కొట్టిస్తాడు.కాని ఎవరిచేతిలోతెలంగాణా వుందో వారిని ఒక్క మాటకూడా అనడు. మరి ఇటలి హ్యాండ్ అంటే భయమో ఏమో తెలియదు. డైరెక్ట్గ గా-మేము తెలంగాణాకు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ మరీ చేబుతిన్న MIM ఒవైసీ వారిని కూడా ఏమీ  అనలేడు.మరి వారంటే సారుకు మరీ మరీ భయమేమో!
      కెసిఆర్ గారు  మీరు ఇప్పుడైనా చిత్తశుద్దితో తెలంగాణా వాదులందరినీ కలుపుకొని పోరాటము చేయండి.అభం శుభం తెలియని అమాయకులైన తెలంగాణా ప్రజానీకాన్ని ఇంకా మోసం చేయకండి!     యాగాలు,కుట్రలు,కుతంత్రాలు చేస్తేనో,బూతులు తిడితెనో,ప్రజలను భయపడిస్తేనో, విగ్రహాలను పడేస్తేనో తెలంగాణ
రాదు. మరొకసారి  మన జాతిపిత గాంధీ గారి జీవిత చరిత్రను క్షుణంగా చదవండి.ఆ మహానుభావుడి మార్గాన్ని అనుసరించండి.!
    వ్యూయర్స్/రీడర్స్ ! ఇది ఎవర్ని నొప్పించాలని  రాయలేదు. ఉన్నవాస్తవ పరిస్తితులను  ఉటంకించాను.

Saturday, 10 March 2012

ఇంకా ఎంతమందిని చంపుతారు ?

     నీతి ,నిజాయతీగా పని చేసేవారికి ఈ దేశంలో స్థానం లేదా!? బ్రతికే హక్కు లేదా!!? బ్రతక్కూడదా!!!?


        మైనింగ్ మాఫియా మరొకసారి పడగవిప్పి M P లోని మారేనా జిల్లాలోబన్మోర్ SDPO గా పని చేస్తున్ననరేంద్ర కుమార్ సింగ్ IPS ని అతిదారుణంగా ట్రాలి ట్రాక్టర్తో తొక్కించి చంపింది.
        
       నిజాయితీ పరులైన కొందరు అధికారులు, సమాజ సేవకులు, ఉద్యమకారులు,విలేఖర్లు ,కార్యకర్తలను మాఫియ మూకలు  అంతమొందిస్తున్నాయి.
   
   మొన్నటికిమొన్న చెన్నైలోని ఆవడిలో భువనేశ్వరన్  అనే  సోషల్ వర్కర్ ని  bike నుండి లాగి తన నాలుగేళ్ల    కూతురుముందే realestate mafia నరికి చంపింది.ఇతను చేసిన పాపం-రియల్ ఎస్టేట్ గూండాలను  ఎదుర్కోవడమే!

అలాగే గత నెలలో చంద్రిక రాయ్ అనే విలేఖర్ని,అతని కుటుంబాన్ని మైనింగ్ మాఫియా  MP లో మట్టుపెట్టింది. ఇతను చేసిన నేరము-MP లోని ఉమరియా జిల్లాలో అక్రమ బొగ్గు తవ్వకాలపై పేపర్లో రాయడమే!

గతేడాది జార్ఖండ్ లో కేరళ రాష్ట్రానికి చెందిన సిస్టర్ వల్సా జాన్ అనే NUN ను COAL MAFIA  చంపేసింది.ఈమె చేసిన  మంచి పని-బొగ్గి మాఫియా ని ఎదుర్కోవడమే .

భోపాల్లో-DIAMOND MAFIA  ,సేహ్ల మసూద్ అనే  R T I ఉద్యమరాలుని కాల్చి చంపింది.

ఇలా చెప్పుకుంటూ పొతే-ఒక  శంకర్ గుహ నియోగి-విప్లవ కార్మిక నాయకుడు,ఒక జ్యోతిర్మయి డే-ముంబై ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ను,ఒక సోనేవానే-అదనపు జిల్లా కలెక్టర్,ఓ మంజునాథ్-I O C గ్రేడ్ ఎ ఆఫీసర్ ను చమురు మాఫియా తగులబెట్టి చంపేసింది.
                             
                                     ఇలా ఇంకా ఎంతమందిని చంపుతారు?
           
    ఇలా ఎంతోమంది నిజాయితీపరులను -గనులు,ఇసుక,ఆటవి ఉత్పత్తులు,వన్య ప్రాణులు,రియల్ ఎస్టేట్,ఆయిల్ మరియు మద్యం మాఫియాలు,నిర్భయంగా,నిస్సుగ్గుగా ,నిశ్చింతగా  అంతమొందిస్తింటే ఈ చేతకాని చవట ప్రభుత్వాలు ఏమిచేస్తున్నాయో నాకర్థం కావటం లేదు.

ఈవిధంగా  నీతి నిజాయితీ గల వాళ్ళని,మంచివాళ్ళని చంపు కుంటూ పోతుంటే,వాళ్ళను మనము కాపాడుకోలేక పోతుంటే-భావితరాలకు మనము వీళ్ళను   ఎలా  చూపగలము?
     
అసలు ఈ MAFIA GANG లన్ని ఇలా రేచిపోతుంటే , ఎవరైనా నిబద్ధత కలిగి,నీతి నిజాయితీతో  తమ తమ కార్యకలాపాలను నిర్వర్తించటానికి ముందుకు రాగలారా!?

Saturday, 25 February 2012

....ఏమి కావాలని.....

దేవుడే దిగివచ్చి "ఏమికావాలని" కోరుకోమంటే -

బాగా చదువుకోవాలని  కోరుకునే వాన్ని,చిన్నవయసులో !
మంచి ఉద్యోగం ,మంచి  శ్రీమతి కావాలని కోరుకునేవాన్ని యుక్తవయసులో ! !

ఆ తరువాత  -' కీర్తి శేషులైన నా తల్లిదండ్రులు  కావాలని ,
వారితోపాటు  గాంధీ గారిని ,అంబేద్కర్ గారిని ,శాస్త్రి గారిని ,భగత్ సింగ్  గారిని ,
ఎన్టీయార్ గారిని ,ఘంటసాల గారిని ,సావిత్రి గారిని  ,ఎస్వీఆర్  గారిని ,రాజనాల గారిని ,కాంతారావ్  గారిని ,
నా పిల్లల మంచి భవిష్యత్ ని మరియు నా బాల్యాన్ని  కోరుకున్దామని ' అనికునేవాన్ని .కాని ఇపుడు 

వీటన్నిటిని త్యాగం చేసి ఒకే ఒక్క కోరిక కోరాలను కుంటున్నాను  , అదే-
ప్రపంచంలోని ఏశక్తి  ఆపలేని  రియల్  లేని టీవీ సీరియల్ స్ ని  ఆపమని,
మనుషుల  చేతిలోని బుల్లి భూతాన్ని మాయం చేయమని ,
అంతర్జాలములోని కలుషిత సాలీడులను  పటాపంచల్ చేయమని !!!

Sunday, 12 February 2012

నయవంచన ప్రభుత్వాలు


ఏ ప్రభుత్వాలైన-ప్రజాస్వామ్యం కానివ్వండి,కమ్యూనిజం కానివ్వండి లేక నియంత్రుత్వం కానివ్వండి- కామన్మాన్/ఆం ఆద్మి/సామాన్య ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు.ఈ ప్రభుత్వాలన్ని కేవలం ధనిక వర్గానికి కొమ్ము కాస్తుంది తప్ప,వాల్ల అవసరాలకే ఉపయోగపడుతుంది తప్ప సామాన్య ప్రజానీకానికి ఒరగపెట్టింది ఏమీ లేదు.


    ఎందుకు చెబుతున్నానంటే-రైల్వేలో పుట్టీ పెరిగి గత 30 సం గాrailwayతో అనుబంధం ఉండీ,ఇప్పటికి railwayలో తిరుగుతున్నాను గాబట్టి చెబుతున్నాను-నేను 1977 లోinter చదువుతున్నప్పుడు ఏ express కైనా రెండే రెండు జనరల్ compartments  ఉండేవి.అప్పుడున్న 2 కంపార్ట్మెంట్లే ఇప్పుడూ ఉన్నవి.అంటే దాదాపు 35 యేండ్లవుతున్నా ఒక్కgen comp. కూడా పెంచలేదన్నమాట! అదే అవసరమైతే స్లీపర్ బొగీలు 9,10,11,12 అంటూ పెంచుకుంటూ పోతాడు.ఈ 35సం లలో ఎన్ని లక్షల మంది పెరిగుంటారండీ! అదే ధనికవర్గానికైతే,స్లీపర్లంటాడు,ఏసీలంటాడు ఇంకామాట్లాడితే(అఫ్కోర్స్ మాట్లాడకపోయిన)ఏకంగా ఏసీ ట్రైనే వేస్తాడు.
      ఇలాంటీవి ఎన్నో ఉదా!చెప్పుకోవచ్చండి.మచ్చుకు కొన్ని-


     -హై బాద్ లో-మెహ్దిపట్నం నుండి 13కి మి పొడవున ఎన్నో కోట్లు పెట్టి ఫ్లై ఒవర్ కట్టారండి!అదికేవలము విమాన యాత్రీకులకేనట.ఇతరులు పోరాదట!చూడండి తక్కువ శాతంలో ఉన్నవారికి కోట్లలో రోడ్లు.అదే కేవలం లక్షలు పెడితే గ్రామాల్లో ఉండే అన్ని కాలిబాట్లను cement  రోడ్లుగా మార్చవచ్చు.


     -విశాఖ ఏజెన్సీలో ఉండే బాక్సైట్ కోసము గిరిజనులను గెంటివేయాలని చూస్తున్న ఈ గవర్నమెంట్,(here my meaning is the govt. which is ruling) hyd. లోని బంజారహిల్స్ ఏదైన విలువైన ఖనిజమందని తెలిస్తే అక్కడవారిని గెంటివేయగలదా?


     -తినీ తినక తమ కస్టార్జితమును అనా పైసలతో సహా కూడబెట్టి బాంక్ లో డిపాజిట్చేసే చిరుద్యొగుల పై ,చిన్న వ్యాపారులపై, పెన్సనర్లపై TDS(income tax).అదే కార్పొరేట్ డాక్టర్ల,యాక్తర్ల,బ్యూరోకాట్ల,కాంట్రాక్టర్ల ప్రూఫ్ లేని income  పై నో టాక్స్
       ఇదేనండీ అన్ని ప్రభుత్వాలా తీరు!

Wednesday, 25 January 2012

అపరిశుభ్రతకు ధుర్వాసనకు మరో పేరే మన 'బస్టాండ్లు '




ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయనత్వం
అని మహాకవి శ్రీ శ్రీ గారు అన్నట్లు-


ఏ బస్టాండ్ చూసిన ఏమున్నది పరిశుభ్రం?
అపరిశుభ్రత,దుర్వాసన చెత్త చెదారములకు అది నిలయం!
పాలకులు(GOVT గాని లేక  RTC  యాజమాన్యం కాని)పట్టించుకోక పోవటం మన ఖర్మం.


మన బస్తాండ్ల పరిస్థితి చూసి ఇది పొస్ట్ చేస్తున్నాను.


బస్టాండ్ లోకి అడుగు పెట్టాలంటేనే భయం.అడుగుపెట్టీ పెట్టకముందే దుర్వాసన,అపరిశుభ్రత స్వాగతం పలుకుతాయి.

అదేమి విచిత్రమో గాని ప్రవేశమే( ENTRANCE )భయంఖరంగా ఉంటుంది,రాల్లతొ,రప్పలతోగతుకులతో .ఇక ఒక ప్రక్క చెత్తా చెదారము .ఇంకొక ప్రక్క డ్రైనెజుల్లో కంపు కొడుతు పందులు దర్శనమిస్తాయి. మరొక ప్రక్క URINALS అంతా బయతకు roadlo కొస్తూ దుర్గందమును వెదజల్లుతూ మన శ్వాసకే చాలెంజ్ విసురుతాయి. ఈ పరిస్తితుల్లో /situation లో మనము ఎమీ చెయలేమా...?కాంట్ వి డు ఎని థింగ్...? సిగ్గు సిగ్గు!స్సేం మన పాలకులను తలచుకుంటే.    

Saturday, 21 January 2012

వేషధారణ

 ఒకప్పటి మన వేషధారణ ఇప్పటి వేషధారణ గమనిస్తేఎంతో బాధ కల్గుతోంది.అప్పటి స్త్రీ వేషధారణ చూస్తే ఎంతో హుందాతనము,గౌరవము కలిగెవి.కాని ప్రస్తుత వేషదారణ చూస్తుంటే పాశ్చాత్య మోజులోపడి మనము  యెక్కడకెలుతున్నామో అర్థం కావడం  లేదు.


 లంగావోనిలో,చీరల్లొ కలకల లాడుతు,తెలుగుతనం ఉట్టిపడుతు ఎంతో హుందాగా కనపడేవారు. ఇప్పుడు లంగావోనీలు పోయె, చీరలు పోయే పంజాబీ డ్రస్లొచ్చే.అవీపోయే.పెన్సిల్కట్ జీన్స్ ,షర్ట్ టాప్సొచ్చే .ఎంత అగ్లీగా ఉంటున్నాయి డ్రెస్సులు అస్సలు పైన ఏ అచ్చాదన లేకుండ 
అమ్మాయిలూ,అక్కయ్యలూ మోడర్న్ గా ఉంటూనే గౌరవాన్ని, హుందాతనాన్నిచ్చే డ్రెస్సులేసుకొండి!తద్వార మీ పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడండి,పెంచండి!
   
తల్లిదండ్రులారా మీకొ విన్నపము.ఒకర్ని చూసి ఒకరు అనుకరించే ఈ రోజుల్లో  పిల్లలదేమీ  తప్పు లేదు.వాల్లకు చెప్పవలసిన భాద్యత మన పై ఉంది.దయవుంచి వారికి మన సాంప్రదాయాల గురించిచెప్పండి .బట్టలు  వేసుకునేది శరీరము బహిర్గితము కాకుండ ఉండడానికని  వాల్లకు  అర్థమయ్యేట్లు చెప్పండి .


T- shirts select చేసేటప్పుడు captions ను జాగ్రతగా సెలెక్ట్ చెసుకొమని చెప్పండి.ఈమధ్యనే ఓ అమ్మాయి వేసుకున్న టి షర్త్ను చూసాను,ఆ t shirt పై ఉన్నcaption-see but don't touch.ఇంతకంటె ఘోరము ఏముంటుంది చెప్పండి!