republic day

republicdayintelugu.jpg

Saturday, 12 May 2012

అమ్మా.........నీకు మరో పేరు..............

  అమ్మ.........

ఓ త్యాగం                                                      
ఓ  దైవం
ఓ  సహనం
ఓ  ఔషదం
ఓ  ప్రపంచం
ఓ  అద్భుతం
ఓ  అమృతం
ఓ  తియ్యదన
ఓ  దేవత
ఓ  ఫ్రెండ్
ఓ  గైడ్
ఓ శక్తి
ఓ  ఆశ
ఓ  పాట
ఓ  బడి
ఓ  కోచ్
ఓ  ప్రేమ
ఓ  ఆలన
ఓ  వెలుగు
ఓ  జాబిలి
ఓ కరుణామయి
ఓ మానవతామూర్తి
ఓ ఘంటసాల పాట
ఓ  తనివితీరనిపాట
ఓ  తిరుగులేని మాట
ఓ  వెలకట్టలేనిది
ఓ  విలువ కట్టలేనిది
ఓ  అమూల్యమైనది
             అసలు  అమ్మంటే,  WHAT  WHAT, WHAT NOT, EVERY THING, SHE IS EVERY THING.
ప్రపంచములో ఏదైనా కొనవచ్చును. అమ్మను కొనలేము కదా?!  అలాంటి  అమ్మను  మొన్నామద్య్హ వరంగల్
 దగ్గర ఓ  విలేజ్ లో UNEDUCATED SONS & DAUGHTER  కలసి రోడ్ ప్రక్కన వదిలి వెళ్ళిపోయారు.
మరి ఇక్కడో-సిటీలో మాయింటి ప్రక్కన ఓ EDUCATED ILLITERATE SONS తమతల్లి ఒక్కత్తినే  బాడుగ ఇంట్లో వుంచి కార్లల్లో వచ్చి చూసిపోతూ ఉంటారు,కొడుకులు, మనవల్లు,మనవరాండ్రు.
ఇక OLD AGE HOMES లో ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో లెక్కే లేదు. మరి అక్కడ శ్రీమతులకు అమ్మ కుదరక వేరే ఇంట్లో  పెట్టాల్సి వచ్చిందేమో! మరి అక్కడ స్త్రీలే కదా! అమ్మలే కదా! వనజ వనమాలి గారి లాంటి కోడళ్ళు ఉంటే దేశంలో  అత్తమ్మలందరూ ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారు కదా! జోహార్లండి మీకువనజవనమాలి గారు.
        ఉదయం లేవగానే  స్నానాలుచేసి, శుచి సుభ్రతతో దేవుళ్ళకు పూజలు చేసే సోదరులకు, సోదరీమణులకుఅమ్మలకు,అయ్యలకు,పాపల్లకు,పిల్లలకు నా యొక్క విన్నపము-ఉదయము లేవగానే మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించి మీ దైనందిన కార్యక్రమాలు చూసుకోవాలని నా కోరిక.(మీరనవచ్చు-ఏంటండి హరి గారు మీరు పాటించారా అని !చదువుకొనే రోజుల్లో  పాటించానండి.అయితే తరువాత నాతల్లిదంద్రులను నేనుకోల్పోయానండి.)
     సోదరులార !బయట జరిగే అన్యాయాలను, అక్రమాలను -మనము ఏమీ చేయలేము.కాని మన తల్లి దండ్రులనుచూసుకోవడమనేది , మన చేతుల్లోనే ఉంది, ఆ అజమాయిషి మనదే, కాబట్టి అమ్మా నాన్నలను  చూసుకోండి!
       అమ్మ గురించి ఎప్పటినుండో రాయాలనుకుంటున్న నేను శ్రీను తపన చదివి ఈ టపా పెట్టాను. నాకు వర్నించడాలు, కవిత్వాలు,రచనలు రావు.ఏదో వ్యవహారిక బాషలో అమ్మగురించి  రాయాలనిపించింది,రాసాను.
        చివరిగా ఒక్క మాట-అమ్మకు మరో పేరు త్యాగము  అని నా ఉద్దేశ్యం. మరి మీదో!?