దేవుడే దిగివచ్చి "ఏమికావాలని" కోరుకోమంటే -
బాగా చదువుకోవాలని కోరుకునే వాన్ని,చిన్నవయసులో !
మంచి ఉద్యోగం ,మంచి శ్రీమతి కావాలని కోరుకునేవాన్ని యుక్తవయసులో ! !
ఆ తరువాత -' కీర్తి శేషులైన నా తల్లిదండ్రులు కావాలని ,
వారితోపాటు గాంధీ గారిని ,అంబేద్కర్ గారిని ,శాస్త్రి గారిని ,భగత్ సింగ్ గారిని ,
ఎన్టీయార్ గారిని ,ఘంటసాల గారిని ,సావిత్రి గారిని ,ఎస్వీఆర్ గారిని ,రాజనాల గారిని ,కాంతారావ్ గారిని ,
నా పిల్లల మంచి భవిష్యత్ ని మరియు నా బాల్యాన్ని కోరుకున్దామని ' అనికునేవాన్ని .కాని ఇపుడు
వీటన్నిటిని త్యాగం చేసి ఒకే ఒక్క కోరిక కోరాలను కుంటున్నాను , అదే-
ప్రపంచంలోని ఏశక్తి ఆపలేని రియల్ లేని టీవీ సీరియల్ స్ ని ఆపమని,
మనుషుల చేతిలోని బుల్లి భూతాన్ని మాయం చేయమని ,
అంతర్జాలములోని కలుషిత సాలీడులను పటాపంచల్ చేయమని !!!