republic day

republicdayintelugu.jpg

Saturday, 10 March 2012

ఇంకా ఎంతమందిని చంపుతారు ?

     నీతి ,నిజాయతీగా పని చేసేవారికి ఈ దేశంలో స్థానం లేదా!? బ్రతికే హక్కు లేదా!!? బ్రతక్కూడదా!!!?


        మైనింగ్ మాఫియా మరొకసారి పడగవిప్పి M P లోని మారేనా జిల్లాలోబన్మోర్ SDPO గా పని చేస్తున్ననరేంద్ర కుమార్ సింగ్ IPS ని అతిదారుణంగా ట్రాలి ట్రాక్టర్తో తొక్కించి చంపింది.
        
       నిజాయితీ పరులైన కొందరు అధికారులు, సమాజ సేవకులు, ఉద్యమకారులు,విలేఖర్లు ,కార్యకర్తలను మాఫియ మూకలు  అంతమొందిస్తున్నాయి.
   
   మొన్నటికిమొన్న చెన్నైలోని ఆవడిలో భువనేశ్వరన్  అనే  సోషల్ వర్కర్ ని  bike నుండి లాగి తన నాలుగేళ్ల    కూతురుముందే realestate mafia నరికి చంపింది.ఇతను చేసిన పాపం-రియల్ ఎస్టేట్ గూండాలను  ఎదుర్కోవడమే!

అలాగే గత నెలలో చంద్రిక రాయ్ అనే విలేఖర్ని,అతని కుటుంబాన్ని మైనింగ్ మాఫియా  MP లో మట్టుపెట్టింది. ఇతను చేసిన నేరము-MP లోని ఉమరియా జిల్లాలో అక్రమ బొగ్గు తవ్వకాలపై పేపర్లో రాయడమే!

గతేడాది జార్ఖండ్ లో కేరళ రాష్ట్రానికి చెందిన సిస్టర్ వల్సా జాన్ అనే NUN ను COAL MAFIA  చంపేసింది.ఈమె చేసిన  మంచి పని-బొగ్గి మాఫియా ని ఎదుర్కోవడమే .

భోపాల్లో-DIAMOND MAFIA  ,సేహ్ల మసూద్ అనే  R T I ఉద్యమరాలుని కాల్చి చంపింది.

ఇలా చెప్పుకుంటూ పొతే-ఒక  శంకర్ గుహ నియోగి-విప్లవ కార్మిక నాయకుడు,ఒక జ్యోతిర్మయి డే-ముంబై ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ను,ఒక సోనేవానే-అదనపు జిల్లా కలెక్టర్,ఓ మంజునాథ్-I O C గ్రేడ్ ఎ ఆఫీసర్ ను చమురు మాఫియా తగులబెట్టి చంపేసింది.
                             
                                     ఇలా ఇంకా ఎంతమందిని చంపుతారు?
           
    ఇలా ఎంతోమంది నిజాయితీపరులను -గనులు,ఇసుక,ఆటవి ఉత్పత్తులు,వన్య ప్రాణులు,రియల్ ఎస్టేట్,ఆయిల్ మరియు మద్యం మాఫియాలు,నిర్భయంగా,నిస్సుగ్గుగా ,నిశ్చింతగా  అంతమొందిస్తింటే ఈ చేతకాని చవట ప్రభుత్వాలు ఏమిచేస్తున్నాయో నాకర్థం కావటం లేదు.

ఈవిధంగా  నీతి నిజాయితీ గల వాళ్ళని,మంచివాళ్ళని చంపు కుంటూ పోతుంటే,వాళ్ళను మనము కాపాడుకోలేక పోతుంటే-భావితరాలకు మనము వీళ్ళను   ఎలా  చూపగలము?
     
అసలు ఈ MAFIA GANG లన్ని ఇలా రేచిపోతుంటే , ఎవరైనా నిబద్ధత కలిగి,నీతి నిజాయితీతో  తమ తమ కార్యకలాపాలను నిర్వర్తించటానికి ముందుకు రాగలారా!?