republic day

republicdayintelugu.jpg

Saturday, 19 May 2012

ఎక్కడైనా ఉందా.......

ఏంటి ఎక్కడైనా ఉండేది? అని అనుకుంటున్నారా! అదే ,అక్కడకే వస్తున్నా!
అసలు  మన  దేశమంటే  పుణ్యభూమి అనే కదా !అందుకే కదా 
,పుణ్యభూమి నా దేశం నమో! నమామీ! అనే పాటకూడా వచ్చింది.  

అయితే ఇలాంటి పుణ్య భూమిని పాపభూమిగా మారటానికి/మార్చటానికి
 ఎన్నిరకాలైన  పైశాచిక  కార్యక్రమాలు  చేయాలనో చేసారు, చేస్తూనే  ఉన్నారు. 

లంచగొండి తనం-ఓ భయంకరమైన  మహమ్మారి.దాన్ని నాశనం చేయలేకపోయామ్,ఎందుకంటే -IT PREVAILS EVERY WHERE, అన్నారు. IT CAN'T BE ERADICATED -అన్నారు.

మరి  దీని కంటే ఇంకా భయంకరమైన వ్యాధి దేశాన్ని పట్టి పీడిస్తోంది. నిర్వీర్యం చేస్తోంది.అదే  అదే -కలుషితం, కలుషితం.కొందరిలో నరనరాన జీర్ణించుకుపోయి భావి భారతాన్ని చిద్రం చేస్తోంది.

కలుషితం కలుషితం ఎక్కడబడితే  అక్కడ కలుషితం-
తినే తిండిలో కలుషితం,
త్రాగే నీరులో కలుషితం,
పాలల్లో కలుషితం,
పానీయాల్లో కలుషితం,
మందుల్లో కలుషితం,
"మందులో" కలుషితం,
ఎరువుల్లో కలుషితం,
గింజల్లో కలుషితం,
పప్పుల్లో కలుషితం,
నూనెల్లో కలుషితం,

మానవ సంబంధాలు కలుషితం,
అనుబందాలు,అనురాగాలు కలుషితం,
ప్రేమలు,అభిమానాలు కలుషితం,
పలకరింపులు,తియ్యని మాటలు కలుషితం,

ఆలయాలు,విద్యాలయాలు,వైద్యాలయాలు,
ఆటల శిక్షణాలయాలు,కార్పోరేట్ సంస్తలు
ఇలా ప్రతిఒకటీ  ' కలుషితాలే' ,  "కలుషితాలయాలే!!

  " కాదేది కవితకనర్హం" అని శ్రీ శ్రీ  గారన్నట్లు.
కాదేది కలుషితాని కనర్హం,అని అనుకోవాల్సి వస్తోంది.,
ఎందుకంటే,నేను (ఆ మాటకొస్తే  మనమందరం)కలలో కూడా ఊహించని
ఓ -కలుషితం-మొన్ననే టీవీ లో చూసానండి.అప్పటి నుండి  ఈ విషయం పై 
పోస్ట్ పెట్టాలని ,మీతో పంచుకోవాలని, అనుకున్నాను,యిప్పడు పెట్టానండి.

విషయానికొస్తే -అపుడెపుడో పేపర్లో చదివానండి-ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల బదులుబినామి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారని. ఇదే భరించరాని తప్పు. ప్రభుత్వపు ఫైళ్ళను ఇతరులు చూడటం 
పెద్ద నేరము.అరె  GOVT. ఏమి చేస్తోందని  అప్పుడే ఆశ్చర్య పడ్డాము. కాని అక్కడ ఏ ప్రాణికి ఆపద ఏమీ లేదు.

కాని మొన్నటీవిలో వచ్చిన  విషయం-గాంధీ ఆసుపత్రిలో రోగులకు E C G TEST చేసేది ఎవరో తెలుసా?
TECHNICALLY  QUALIFIED AND LICENSED LAB TECHNICIANS కాదు.అనామకులు. ఏ స్కిల్లూ లేని UNSKILLED SPURIOUS YOUTH. వీరు....   అక్కడ టెస్ట్లు లు చేసేవారు. వీరి టెస్టుల్లో ఏదైనా  లోపంజరిగితే. అ రోగుల గతేంటి? వారి జీవితాలకు  గ్యారంటీ ఎవరు?ఇదేంటని  మీడియా వాళ్ళు అడిగితే వారిపై దౌర్జన్యాలు.అసలేంటి మన దౌర్భాగ్యం. మందుల్లో, సూదుల్లోనే  ఈ కలుషిత మహమ్మారి ఉందనుకుంటేచివరికి ఆసుపత్రి ఉద్యోగుల్లో కూడా కలుషిత ఉద్యోగులు ఉన్నారు. ఇది  ఆందోళన చెందవలసిన పరిస్తితే! ఇది ఇలాగే కొనసాగితే 
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు పోరేమో.లేక భయపపడతారేమో!


చివరికి చంటి పిల్లలు త్రాగే పాలల్లో కూడా  ఈ కలుషితం దోబూచులాడుతోంది. అందకే అంటున్నాను ,
"ఎక్కడైనా ఉందా ?! కలుషితం  లేనిది" అని.
ఒకవేళ  ఉంటే గింటే అదొక్క తల్లిప్రేమలోనే అనుకుంటా!తల్లి లోనే అనుకుంటా!!