ఏ ప్రభుత్వాలైన-ప్రజాస్వామ్యం కానివ్వండి,కమ్యూనిజం కానివ్వండి లేక నియంత్రుత్వం కానివ్వండి- కామన్మాన్/ఆం ఆద్మి/సామాన్య ప్రజానీకానికి చేసింది ఏమీ లేదు.ఈ ప్రభుత్వాలన్ని కేవలం ధనిక వర్గానికి కొమ్ము కాస్తుంది తప్ప,వాల్ల అవసరాలకే ఉపయోగపడుతుంది తప్ప సామాన్య ప్రజానీకానికి ఒరగపెట్టింది ఏమీ లేదు.
ఎందుకు చెబుతున్నానంటే-రైల్వేలో పుట్టీ పెరిగి గత 30 సం గాrailwayతో అనుబంధం ఉండీ,ఇప్పటికి railwayలో తిరుగుతున్నాను గాబట్టి చెబుతున్నాను-నేను 1977 లోinter చదువుతున్నప్పుడు ఏ express కైనా రెండే రెండు జనరల్ compartments ఉండేవి.అప్పుడున్న 2 కంపార్ట్మెంట్లే ఇప్పుడూ ఉన్నవి.అంటే దాదాపు 35 యేండ్లవుతున్నా ఒక్కgen comp. కూడా పెంచలేదన్నమాట! అదే అవసరమైతే స్లీపర్ బొగీలు 9,10,11,12 అంటూ పెంచుకుంటూ పోతాడు.ఈ 35సం లలో ఎన్ని లక్షల మంది పెరిగుంటారండీ! అదే ధనికవర్గానికైతే,స్లీపర్లంటాడు,ఏసీలంటాడు ఇంకామాట్లాడితే(అఫ్కోర్స్ మాట్లాడకపోయిన)ఏకంగా ఏసీ ట్రైనే వేస్తాడు.
ఇలాంటీవి ఎన్నో ఉదా!చెప్పుకోవచ్చండి.మచ్చుకు కొన్ని-
-హై బాద్ లో-మెహ్దిపట్నం నుండి 13కి మి పొడవున ఎన్నో కోట్లు పెట్టి ఫ్లై ఒవర్ కట్టారండి!అదికేవలము విమాన యాత్రీకులకేనట.ఇతరులు పోరాదట!చూడండి తక్కువ శాతంలో ఉన్నవారికి కోట్లలో రోడ్లు.అదే కేవలం లక్షలు పెడితే గ్రామాల్లో ఉండే అన్ని కాలిబాట్లను cement రోడ్లుగా మార్చవచ్చు.
-విశాఖ ఏజెన్సీలో ఉండే బాక్సైట్ కోసము గిరిజనులను గెంటివేయాలని చూస్తున్న ఈ గవర్నమెంట్,(here my meaning is the govt. which is ruling) hyd. లోని బంజారహిల్స్ ఏదైన విలువైన ఖనిజమందని తెలిస్తే అక్కడవారిని గెంటివేయగలదా?
-తినీ తినక తమ కస్టార్జితమును అనా పైసలతో సహా కూడబెట్టి బాంక్ లో డిపాజిట్చేసే చిరుద్యొగుల పై ,చిన్న వ్యాపారులపై, పెన్సనర్లపై TDS(income tax).అదే కార్పొరేట్ డాక్టర్ల,యాక్తర్ల,బ్యూరోకాట్ల,కాంట్రాక్టర్ల ప్రూఫ్ లేని income పై నో టాక్స్
ఇదేనండీ అన్ని ప్రభుత్వాలా తీరు!