republic day

republicdayintelugu.jpg

Saturday, 19 May 2012

ఎక్కడైనా ఉందా.......

ఏంటి ఎక్కడైనా ఉండేది? అని అనుకుంటున్నారా! అదే ,అక్కడకే వస్తున్నా!
అసలు  మన  దేశమంటే  పుణ్యభూమి అనే కదా !అందుకే కదా 
,పుణ్యభూమి నా దేశం నమో! నమామీ! అనే పాటకూడా వచ్చింది.  

అయితే ఇలాంటి పుణ్య భూమిని పాపభూమిగా మారటానికి/మార్చటానికి
 ఎన్నిరకాలైన  పైశాచిక  కార్యక్రమాలు  చేయాలనో చేసారు, చేస్తూనే  ఉన్నారు. 

లంచగొండి తనం-ఓ భయంకరమైన  మహమ్మారి.దాన్ని నాశనం చేయలేకపోయామ్,ఎందుకంటే -IT PREVAILS EVERY WHERE, అన్నారు. IT CAN'T BE ERADICATED -అన్నారు.

మరి  దీని కంటే ఇంకా భయంకరమైన వ్యాధి దేశాన్ని పట్టి పీడిస్తోంది. నిర్వీర్యం చేస్తోంది.అదే  అదే -కలుషితం, కలుషితం.కొందరిలో నరనరాన జీర్ణించుకుపోయి భావి భారతాన్ని చిద్రం చేస్తోంది.

కలుషితం కలుషితం ఎక్కడబడితే  అక్కడ కలుషితం-
తినే తిండిలో కలుషితం,
త్రాగే నీరులో కలుషితం,
పాలల్లో కలుషితం,
పానీయాల్లో కలుషితం,
మందుల్లో కలుషితం,
"మందులో" కలుషితం,
ఎరువుల్లో కలుషితం,
గింజల్లో కలుషితం,
పప్పుల్లో కలుషితం,
నూనెల్లో కలుషితం,

మానవ సంబంధాలు కలుషితం,
అనుబందాలు,అనురాగాలు కలుషితం,
ప్రేమలు,అభిమానాలు కలుషితం,
పలకరింపులు,తియ్యని మాటలు కలుషితం,

ఆలయాలు,విద్యాలయాలు,వైద్యాలయాలు,
ఆటల శిక్షణాలయాలు,కార్పోరేట్ సంస్తలు
ఇలా ప్రతిఒకటీ  ' కలుషితాలే' ,  "కలుషితాలయాలే!!

  " కాదేది కవితకనర్హం" అని శ్రీ శ్రీ  గారన్నట్లు.
కాదేది కలుషితాని కనర్హం,అని అనుకోవాల్సి వస్తోంది.,
ఎందుకంటే,నేను (ఆ మాటకొస్తే  మనమందరం)కలలో కూడా ఊహించని
ఓ -కలుషితం-మొన్ననే టీవీ లో చూసానండి.అప్పటి నుండి  ఈ విషయం పై 
పోస్ట్ పెట్టాలని ,మీతో పంచుకోవాలని, అనుకున్నాను,యిప్పడు పెట్టానండి.

విషయానికొస్తే -అపుడెపుడో పేపర్లో చదివానండి-ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల బదులుబినామి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారని. ఇదే భరించరాని తప్పు. ప్రభుత్వపు ఫైళ్ళను ఇతరులు చూడటం 
పెద్ద నేరము.అరె  GOVT. ఏమి చేస్తోందని  అప్పుడే ఆశ్చర్య పడ్డాము. కాని అక్కడ ఏ ప్రాణికి ఆపద ఏమీ లేదు.

కాని మొన్నటీవిలో వచ్చిన  విషయం-గాంధీ ఆసుపత్రిలో రోగులకు E C G TEST చేసేది ఎవరో తెలుసా?
TECHNICALLY  QUALIFIED AND LICENSED LAB TECHNICIANS కాదు.అనామకులు. ఏ స్కిల్లూ లేని UNSKILLED SPURIOUS YOUTH. వీరు....   అక్కడ టెస్ట్లు లు చేసేవారు. వీరి టెస్టుల్లో ఏదైనా  లోపంజరిగితే. అ రోగుల గతేంటి? వారి జీవితాలకు  గ్యారంటీ ఎవరు?ఇదేంటని  మీడియా వాళ్ళు అడిగితే వారిపై దౌర్జన్యాలు.అసలేంటి మన దౌర్భాగ్యం. మందుల్లో, సూదుల్లోనే  ఈ కలుషిత మహమ్మారి ఉందనుకుంటేచివరికి ఆసుపత్రి ఉద్యోగుల్లో కూడా కలుషిత ఉద్యోగులు ఉన్నారు. ఇది  ఆందోళన చెందవలసిన పరిస్తితే! ఇది ఇలాగే కొనసాగితే 
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరు పోరేమో.లేక భయపపడతారేమో!


చివరికి చంటి పిల్లలు త్రాగే పాలల్లో కూడా  ఈ కలుషితం దోబూచులాడుతోంది. అందకే అంటున్నాను ,
"ఎక్కడైనా ఉందా ?! కలుషితం  లేనిది" అని.
ఒకవేళ  ఉంటే గింటే అదొక్క తల్లిప్రేమలోనే అనుకుంటా!తల్లి లోనే అనుకుంటా!!







31 comments:

  1. కలలో కూడా ఊహించని నిజాలు మా ముందుంచారు. బినామీలు ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యటమా? ఇంకా ECG tests unskilled youth చేస్తున్నారా? Wrong diagnosis వల్ల ప్రాణాలు పోతాయన్న విషయం వల్లాక తెలియకా, లేక తెలిసినా ప్రాణానికి వారు విలువ ఇవ్వకపోవటమా? ఈ అం షొచ్కెద్ హరిగారు!
    కలుషితమై పోతున్నవెన్నో మీరు చెప్పారు. కాని మన మనసులే కలుషితమైపోయాయి. ఎవరన్నా పోని ముందడుగు వేసి మార్పు తెద్దామా అని నడుం బిగించి ఇంకో నలుగురిని పోగు చేసుకోగలడేమో కాని, మిగతా అందరూ అతనేమి hidden agenda లేకుండా ఎందుకు మార్పు కోసం పోరాడుతున్నాడు అన్న కలుషితమైన ద్రుష్టితోనే చూస్తారు.అలోచింపచేసారు హరిగారు. మంచి పోస్ట్!

    ReplyDelete
    Replies
    1. జలతారువెన్నెల గారు,
      మనుషులు,మనసులు -కలుషితమైన ఈ రోజుల్లో
      దేన్నైనా ఎదిరించాలంటే కూడా ప్రోబ్లమే,భయమే! RED HANDED గా
      పట్టుకున్న టీవీ మీడియా వాళ్ళే ఏమీ చేయలేక పోయారు. సామాన్యులమైన
      మనము ఏమి చేయగలము. మీరు -సోది- అని అనుకోకపోతే ఓచిన్న విషయం-
      మేము చదువుకునే రోజుల్లో-సేవ చేయాలనే ఉద్దేశ్యంతో-UPLIFT ASSOCIATION-అనే పేరుతో
      ఓ association open చేసాము. అందులో భాగంగా ,వీధుల్లో మొక్కలు నాటాము. అయితే ఆ సమయంలో
      కొందరు,మీకెంత ఫండ్స్ వచ్చాయి,అందులో మీరెంత తిన్నారు ,అని డైరెక్ట్ గా అడిగారు. మీరు చెప్పిన HIDDEN AGENDA
      అక్షరాల నిజం,నిజం,నిజం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేకున్నామండి.ఏదో ఈ విదంగా SHARE చేసుకోవడం తప్పా!
      Thank you very much for your nice comment.

      Delete
    2. Hari garu.. in my opinion, we no need to care any one if we are doing anything for a purpose and greater good..
      So we no need to stop doing good thing if some other people are blaming us.
      edo naaku telisinadi nenu cheppanu, thappu ga bavinchavaddani naa manavi...

      Delete
  2. polution for the people, to the poeple, and by the people.

    ReplyDelete
    Replies
    1. The Tree గారు,
      మీ బ్లాగ్ title-THE TREE-నాకు బాగా నచ్చిందండి.
      మీ simple comment సూపరండి. చక్కగా అన్వయించారు.
      మీ స్పందనకు ధన్య వాదాలండి!thanq very much for your encouragement.

      Delete
  3. హరి
    excellent post పెట్టావు
    భరించలేని వాస్తవాలను చక్కగా బహిర్గతం చేసావు
    మామిడి పండ్లు తినడానికే భయపడే రోజులు 'కార్బైడ్' వల్ల
    కాని అన్నీ తెలిసి తెలిసి నిర్లిప్తంగా మనం ఎమీ చేయలేములే అనుకుని వుండేకన్నా
    ఎపుడో ఒకసారైన ఎవరోఒకరైన మార్చడానికి ,మారడానికి ప్రయత్నిస్తే చాలాబాగుంటుంది

    ReplyDelete
  4. అలాంటి రోజులోస్తాయని ఆశిద్దాము ,శ్రీను.
    నీ చక్కని ప్రశంశ కు ధన్యవాదాలు శ్రీను.
    అన్నట్టు నీ భువనేశ్వర్ trip ఎలా జరిగింది శ్రీను?

    ReplyDelete
    Replies
    1. భువనేశ్వర్ ట్రిప్ బాగానే జరిగింది హరి
      బ్లాగర్ల response చాలా బాగా వస్తోంది హరి నీ పోస్ట్స్ మీద
      good going keep it up

      Delete
    2. thank you verumuch sreenu.
      really you are encouraging me a lot
      once again thank you very much

      Delete
  5. /"ఎక్కడైనా ఉందా ?! కలుషితం లేనిది" అని.
    ఒకవేళ ఉంటే గింటే అదొక్క తల్లిప్రేమలోనే అనుకుంటా!తల్లి లోనే అనుకుంటా!!/
    తల్లి ప్రేమ, పసిబిడ్డ నవ్వు, కుక్కపిల్ల ముద్దుగొలపటం, గొర్రెపిల్ల గెంతులేయడం, విరిసిన వెన్నెల, చల్లటిగాలి,చిరుజల్లులో తడుస్తున్న గడ్డిపూవు, కోకిల గానం, ... లాంటి మానసికమైన ఆనందాన్ని కలిగించేవాటితో, భౌతిక పదార్థాల కాలుష్యతను ఎలా పొల్చడమో నాకు తెలియదు కాని, అవినీతి అంటువ్యాధిలా ప్రబలింది, ప్రబలుతోంది అన్న మీ మాటలతో కేటగోరికల్‌గా ఏకీభవిస్తాను.

    ReplyDelete
    Replies
    1. nice illusion అండి SNKR గారు.
      Other than human beings లో మీరు చూపించిన/చూసిన purity ,really great. మంచి ఐడియా.
      especiaally-చిరుజల్లులో తడుస్తున్న గడ్డిపూవు, చాలా మంచి ఉపమాణమ్.అయితే human feelings కి వీటికి
      పోల్చగలిగితే, నిజంగా అద్భుతమే!
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  6. కలుషితం కానిది 'అవినీతి' ఒక్కటే.

    ReplyDelete
    Replies
    1. :)) correct!

      Delete
    2. BONAGIRI గారు,

      fantastic, what an idea!

      such a beautiful answer.

      one shot two birds.

      hats off to you.

      t h a n k s.

      Delete
    3. @ SNKR GAARU,
      DOUBLE CORRECT

      Delete
  7. Sir
    అక్షరాలను సైతం కలుషితం చేసుకుని, ఆలోచనలను కలుషితం చేసుకుని స్వచ్ఛతను వెతుక్కునే కబోదులం అయ్యే దౌర్భాగ్య స్థితి మనది. మీ ప్రతి పోస్టు అర్ధవంతంగా ఉంటుంది

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు,

      స్వచ్ఛతను వెతుక్కునే కబోదులం అయ్యే దౌర్భాగ్య స్థితి మనది.

      కరెక్ట్ గా చెప్పారండి. మీ ప్రసంశ ఓ బూస్ట్.THANKS FOR ENCOURAGEMENT.

      మరొకసారి ధన్యవాదాలతో

      -హరి

      Delete
  8. మంచి టాపిక్ ని స్పృశించారు. అమీర్ ఖాన్ సత్యమేవ జయతేలో ఈ విషయం గురించి ఎపిసోడ్ చేయమని చెప్పచ్చు :) ఇహ విషయానికి వస్తే లోపాలు అన్నది గవర్నమెంటు లోనే కాదు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా జరుగుతున్నాయి. ఈ లోపాలకి ముఖ్య కారణం నాకు తెలిసి అశ్రద్ధ. మా చుట్టాల ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు jarigina sanghatana. నాకు దూరపు వరుస పిన్ని అవుతారు. ఆవిడకి టెస్ట్లు అన్నీ చేసి కడుపులో బిడ్డకి జన్యు లోపం ఉందని ఒక వెల్ experienced technician ఇచ్చిన రిపోర్టు. డాక్టరు కూడా సరిగ్గా చూడకుండా అబార్షన్ చేయించేసుకోవడం మంచిదని చెప్పేశారు. వాళ్ళకి మనసొప్పక బాధపడుతూ ఏమి చెయ్యాలా అన్న సందిగ్ధంలో మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే తెలిసిన విషయమేమిటి అంటే వాళ్ళు క్రోమోసోములని సరిగ్గా లెక్క కూడా పెట్టలేదు ఎన్నున్నాయో. ఆ రిపోర్ట్ చూపించి చిన్నపిల్లలకి ఇచ్చి లేక్కపెట్టమన్నా చక్కగా లేక్కపెట్టగలరు అది సంగతి. ఇలా ఉంది జనాల పని తీరు!! మరీ పెద్ద వ్యాఖ్య వ్రాసేసి విసిగించలేదు కదా!

    ReplyDelete
    Replies
    1. rasagnaa(ni) garu,

      విస్గించలేదు.మీ స్పందనకు థాంక్స్.
      ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రభుత్వానికి నియంత్రణ లేదు .
      ఇక ప్రైవేటు రంగం పై ఏమి అజమాయషి ఉంటుంది చెప్పండి.
      మీలాంటి అనుభవాలు నిజంగా చాలా మందికి జరుగుతున్నాయి.
      కాని ఏమీ చేయలేక నిశ్చేష్టులమై ,పదిమందితో పంచుకోవటం జరుగుతోంది .
      మంచి రోజులేమైన వస్తాయేమో ఆశిద్దాము .మరొకసారి ధన్యవాదాలతో - హరి.

      Delete
  9. చాలా మంచి విషయాన్ని తీసుకున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణాలు వాటి మూలాలను రూపుమాపేందుకు ఏమి చేయాల్నో కూడా తరువాత పోస్టులలో వ్రాస్తే ఇంకా పరిపూర్ణత వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. palla kondala rao gaaru,

      మీ స్పందనకు ధన్యవాదాలు.

      నిజంగా మంచి సలహా ఇచ్చారు.

      ఆవిధంగా వ్రాయటానికి ప్రయత్నము చేస్తాను.

      ఇలాగే మీ సలహాలను ,ప్రోత్సాహాన్ని ఆశిస్తూ -హరి

      Delete
  10. కల్తీ అరవైఅయిదేళ్ళలో పాపం పెరిగినట్లు పెరిగింది, ఇంకా పెరుగుతోంది. కల్తీ లేనిది ఇక ఈ జీవితానికి చూడలేమేమో!

    ReplyDelete
    Replies
    1. కష్టేఫలే గారు,

      మీ బ్లాగ్ కు మాన్చి పేరు సెలెక్ట్ చేసినందుకు కంగ్రాట్స్ అంది .

      భలే ఐడియా వచ్చింది మీకు.మీ బ్లాగ్ పేరు చూడగానే ఉద్భోధ గుర్తొస్తుంది.

      కల్తీ లేనిది ఇక ఈ జీవితానికి చూడలేమేమో!-చాలాబాగా ఊహించారండి .కరెక్టే !

      మీ స్పందనకు థాంక్సండి.మరొకసారి కలుద్దాం.

      Delete
  11. Peddananna garu ,
    Mee blog ni visit chesi chaala rojulu ayyindi .. kshaminchandi ..
    Nenu kudaa chaala pollution ni face chesanu .
    Firstly , I thought of registering myself at Sarojini Devi Eye Hospital to donate my eyes. I visited the place two times . But, there was none to guide me to where and when i can register. The response was also not good. They have seen me as if i am some crap came to disturb them. I felt, having a good idea is also wrong these days. I wonder, how all those patients get eyes for them.
    Secondly, i see many elder people (mainly gents) occupying all the women's seat in buses. My point is
    I have no problem when old people sit. Two seats for senior citizens. Two seats for Handicapped. But all the 4 seats along with 1 more front seat in Metro buses is being occupied by only old people(mostly gents).
    Elders teach us many things to us to have good culture, nature and character. But when it comes to rules and regulations and rights, noone is perfect. Even me many times. I admit it.
    When Gents sit in the front seats, women keep gossiping/chanting but very few admit their right and occupy the seats. Why to gossip if there are any issues ?? Why not take Action ??

    We, Indians are very bad at following rules and regulation. But, at least we should be good at having our right at any point.

    Mostly i never take a seat when elders are in bus. But one day,I was feeling very painful and asked a uncle to give me Women's seat.I was not wrong. He said "avunu amma anni ladies seats.. meere manushulu .. meere kurchovali kada " . I felt like slapping him.Everyone was just staring but noone helped me out. I stood crying till i reach Dilsukhnagar , not for the pain but for the words of him and his attitude towards women.

    Thank you.Waiting for the reply ,
    Budha

    ReplyDelete
  12. manamu emi cheyalema anukunte, manaki manamu edutivanni anyayam chestunnama ani prasnichukunte evariki varu doshuluga nilabadataru. evarini uddariddamani ee pitchi ratalu.nuvvu sanganiki em chesavu? okkati gurtu pettuko manamu manchi cheyaleka pote poni, kani vakadiki keedu cheyakudadu kada, ala cheste adi evariki ayina sapam ga marutundi.

    ok good bye frined - good block

    ReplyDelete
    Replies
    1. dear anonymous gaaru,

      first of all let me thanks for your visit.

      నేను చాల రోజులనుండి బ్లాగ్స్ చూడటం ,పోస్టింగ్స్ పెట్టటం మానేసాను.ఐతే నిర్భయ విషయం జరిగిన తర్వాత మరలా వ్రాయాలనిపించి,ఈ నూతన సం లో start చేద్దామని బ్లాగ్ ఓపెన్ చేశాను,మీ కామెంట్ కనపడింది .వెంటనే reply ఇస్తున్నాను.మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.నా title క్రింద "స్వగతం" చదివితే నేనెందుకు ఈ బ్లాగ్ పెట్టానో తెలుస్తుంది.ఇక నా profile లో introduction చదివితే మీ విమర్శకు జవాబు దొరుకుతుంది."నువ్వు సంగానికి ఏమి చేసావు"అనే మీ సంభోధనలోనే మీ సంస్కారం బయట పడుతోంది.అయిన మీరు అడిగారు కాబట్టి చెపుతున్నా-నేను సంఘానికి ఏ కీడు చేయలేదు.చేయను కూడా.ఏ కీడు చేయకపోవడం కూడా ఓ help చేసినట్లే.నేను సొసైటీ కి నా purview లో చేయకల్గినది చేస్తూనే ఉన్నా!నేను నా duty ని duty గానే కాకుండా అంటే -డ్యూటీ ని డ్యూటీ గా కాకుండా "DUTY WITH SERVICE ORIENTATION" గా చేయడం వేరు.నేను ఆ రెండోది అనుసరిస్తాను.
      నా పోస్టింగ్స్ అన్నీ చదివి మీ కామెంట్స్ రాయగలరు.మరొక సరి ధన్యవాదాలతో-హరి.

      Delete
    2. Anonymous గారు
      ఒకరిని విమర్శించడానికి ధైర్యంగా పేరు కూడా
      చెప్పి విమర్శిస్తే బాగుంటుందేమో

      Delete
  13. హరి నూతన సంవత్సరంలో బ్లాగు పునః ప్రారంభించు

    ReplyDelete
    Replies
    1. డియర్ శ్రీను,
      ఈరోజే బ్లాగ్ ఓపెన్ చేసాను.
      thanq for encouragement.
      ఓ రెండు పోస్ట్లు పెట్టాలి.త్వరలో పెడతాను.
      మరి నీవేమైన పెట్టావా? నీవు కూడా పెట్టు.



      Delete
  14. Seriously your blog is very good sir.. I am becoming a fan for your posts.
    Please start writing again.. :)

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete