SENIOR INTER RESULTS వచ్చాయి!
Physics లో 31 శాతం మాత్రమే పాసయ్యారు.మరి మిగాతవారు ఎందుకు ఫెయిలయ్యారు? వీరందరూ చదువర్లు కారా? క్లవర్ స్టూడెంట్స్ కాకపోయిన ,average, above average ఉండరా?మరి ఇంత ఎక్కువ శాతం fail కావటానికి గల కారణాలేమిటి?
విధ్యా ప్రమాణాలు పడిపోవడమా?
విద్యార్థుల్లో ఆ ZEAL లేకపోవటమా?
ప్రశ్నాపత్రాలు తయారుచేసిన వారి భాద్యతారాహిత్యమా?
గుడ్డినిద్రపోయే ప్రభుత్వమా? లేక
సోకాల్డ్ కార్పోరేట్ విద్యాసంస్థలా?
విద్యార్థులేమో non syllabi questions ఇచ్చారని,ప్రభుత్వమేమో ఎక్కువ ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇచ్చామనిSTATEMENTS యిస్తున్నారు
అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పేది చూస్తే సిగ్గేస్తుంది,నవ్వొస్తుంది.,కోపమూ వస్తుంది. ఎందుకంటే -ఎక్కువ ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇచ్చామని చెప్పడం. ఎక్కువ ఇవ్వడమేమిటి (అప్పటికేదో మెహర్బానీచేసినట్లు), అసలు అన్ని ప్రశ్నలు SYLLABI లో ఉన్నవే ఇవ్వాలి కదా!?
ఇక స్టూడెంట్స్ విసయానికొస్తాం-వీళ్ళు SYLLABI లో ఉన్న ఏ ప్రశ్నైన రాయాలి కదా!? అలా రాయాలంటే మొత్తం SYLLABI చదివుండాలి/నేర్చుకునుండాలి. SYLLABI లో ఏ ప్రశ్న ఇచ్చిన రాయకలిగి ఉండాలి.ఎందుకంటే కొన్ని QUESTIONS OUT OF SYLLABI ఉన్నప్పటికీ మిగతా ప్రశ్నలు రాస్తే కనీసం
పాస్ మార్కులోస్తాయి కదా! SO, ఇక్కడ స్టూడెంట్స్ మొత్తం SYLLABI చదవకుండ ఏదో కొంతమేరకే చదివుంటారనేది జగమెరిగిన సత్యం.(ఇప్పుడున్నటువంటి సినారియోలో వారిని సిలబై అంతా చదవమనడం/నేర్చుకోమనడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి టైము సరిపోవడం లేదు. ఉన్న టైమంతా-SMS లకు,
సెల్లులకు, సినిమాలకు,BOY/GIRL FRIENDS కు మరియు ముఖ పొత్తము (అదేనండి FACE BOOK) లకే
సరిపోతుంది)
ఇక విద్యాసంస్థల విషయానికొస్తే- ప్రభుత్వ సంస్థలను వదిలేద్దాం(అవి ఉన్న లేనట్లే).
ఇక CORPORATE INSTITUTIONS-వేలకు వేలు ఫీజు తీసుకొని తమ వ్యాపారాలను (విద్యా వ్యాపారం)వృద్ధి
చేసుకుంటున్నారే గాని ,అసలు వీళ్ళు విద్య నేర్పుతున్నారా!? ఎక్కువ శాతం ఉన్న AVERAGE, ABOVE AVERAGE STUDENTS ల ఫీజులతో అతి తక్కువ ఉన్న బ్రిలియంట్స్ కు పట్టం కడుతున్నారు, ఇతర విద్యార్థులను పట్టించుకోకుండా .
సో, మొత్తం మనందరిదగ్గర లోపం ఉంది. మనందరం భాద్యులమే!
PERFECT QUESTION PAPER తయారుచేయని వారిని ప్రభుత్వం పట్టిచ్చుకోదు/శిక్షించదు.
వేలకువేలు ఫీజులు కడతాం,వేలు పోసి అరచేయి మహమ్మారిని కొనిస్తాం, కాని పర్యవేక్షణ ఉండదు
లక్షలు పెట్టి ప్రభుత్వాన్ని కొంటారు, ADS గుమ్మరించి మనలను బుట్టలో వేసుకుంటారు,కాని చదువు చెప్పరు
ఇదీ నేటి దుస్థితి. మరి మనము ఏమీ చేయలేమా ...?మీరే చెప్పండి!!