ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయనత్వం
అని మహాకవి శ్రీ శ్రీ గారు అన్నట్లు-
ఏ బస్టాండ్ చూసిన ఏమున్నది పరిశుభ్రం?
అపరిశుభ్రత,దుర్వాసన చెత్త చెదారములకు అది నిలయం!
పాలకులు(GOVT గాని లేక RTC యాజమాన్యం కాని)పట్టించుకోక పోవటం మన ఖర్మం.
మన బస్తాండ్ల పరిస్థితి చూసి ఇది పొస్ట్ చేస్తున్నాను.
బస్టాండ్ లోకి అడుగు పెట్టాలంటేనే భయం.అడుగుపెట్టీ పెట్టకముందే దుర్వాసన,అపరిశుభ్రత స్వాగతం పలుకుతాయి.
అదేమి విచిత్రమో గాని ప్రవేశమే( ENTRANCE )భయంఖరంగా ఉంటుంది,రాల్లతొ,రప్పలతోగతుకులతో .ఇక ఒక ప్రక్క చెత్తా చెదారము .ఇంకొక ప్రక్క డ్రైనెజుల్లో కంపు కొడుతు పందులు దర్శనమిస్తాయి. మరొక ప్రక్క URINALS అంతా బయతకు roadlo కొస్తూ దుర్గందమును వెదజల్లుతూ మన శ్వాసకే చాలెంజ్ విసురుతాయి. ఈ పరిస్తితుల్లో /situation లో మనము ఎమీ చెయలేమా...?కాంట్ వి డు ఎని థింగ్...? సిగ్గు సిగ్గు!స్సేం మన పాలకులను తలచుకుంటే.