republic day

republicdayintelugu.jpg

Sunday, 17 March 2013

.......ఇది సాధ్యమా......?

     ఈరోజు  'The Hindu' పేపర్ చదువుతూ ఉంటే  "holding quote" కనపడింది. అందులో Author 'Anuja Chouhan ' గారి quote- anti-rape law మీద- "WHY CAN'T MEN STAY INDOORS AFTER 8 PM TO STOP RAPE"

ఈ QUOTE చదివిన తరువాత  ఈ పోస్ట్ రాయాలనిపించింది. IS IT  POSSIBLE?  ఇది సాధ్యమా? అదీ మన భారతదేశంలో.మన దేశంలో అధిక శాతం/ మెజారిటీ శాతం ఉద్యగాలు చేసేది  పురుషులే! కుటుంబ పోషకులు వారే!
పితృ  స్వామ్యమున్న మనదేశం లో ఇది సాధ్యమా? అసలు  ఆ  ఊహే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది.
     
          ఏ రంగం తీసుకున్న అత్యధిక శాతం పురుషులే ఉద్యోగం చేస్తుంటారు.అలా ఉద్యోగం చేసే వారిలో -SHIFT SYSTEM లో పని చేసేవారు, NIGHT DUTY  కి  వెళ్ళేవారు, SHIFT DUTY  చేసుకొని ఇంటికి వెళ్ళేవారు- ఇలా ప్రతి రంగం లో పురుషులు పగలనక రాత్రిల్లనక  రాకపోకలు  సాగిస్తూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ  ఎక్కడికక్కడే ఆగిపోతే -జీవితం సాగేదేలా? అసలు అది సాధ్యమా? ఒకవేళ అలాగే  INDOORS లో ఉండిపోవాలే అనుకుందాం-DUTY HOURS అయిపోయిన తరువాత ఆ ఆ సంస్థలు వారిని అక్కడే ఎందుకు ఉండనిస్తాయి.
అలాగే షాప్స్ లో పని చేసే  పురుషుల పరిస్తితి ఏంటి? దాదాపు అన్ని షాప్ లు  రాత్రి పది గంటలకు క్లోజ్ చేస్తారు. మరి వారు ఎక్కడ ఉంటారు? ఎప్పుడో ఉదయం 9 గంటలకు షాప్ ల కొచ్చి  షాప్ లు క్లోజ్ చేసిన తరువాత  వారు
ఇంటికి పోకపోతే వారి FAMILY పరిస్తితి  ఏంటి?

           ఇక ఇంకొక ఉదాహరణ -సినిమాలు , సినిమా హాల్ల  విషయమేంటి-దాదాపు అన్ని SECOND SHOWSకు పోయే వాళ్ళంతా పురుషులే .మరి పురుషులందరూ ఎనిమిది తరువాత  INDOORS లో ఉంటే మరి వాటి పరిస్థితి ఏంటి. FIRST SHOW 9 గంటలు వదులుతారు .మరి 8 దాటి పోయింది  కాబట్టి వాళ్ళందరూ హాలు లోనేఉండిపోవలేనా? అసలు అది సాధ్యమా!

           మరొక చిన్న విషయము - FOUR WHEELER  ఉండే చాలా మంది యజమానులు DRIVERS ని   డ్యూటీ లో పెట్టుకుంటారు. అలా DRIVERS గా ఉద్యోగము చేసేవారందరూ పురుషులే. వారు జమానులను  అవసరాన్ని బట్టి  ఏ సమయములో నైనను తీసుకురావడమో,తీసుకుపోవడమో జరుగుతుంది. మరి ఆ  DRIVERS ని
డ్యూటీ కి పోకుండా ఆపగలమా? పోనీ  పురుష చ్యోదకులే లేకుండా చేద్దామనుకున్దాము. మరి స్త్రీలు  ఆ DRIVERS డ్యూటీ చేయగలరా. OKAY  చేస్తారు అనుకుందాము. ఐతే అది వారికి  COMFORTABLE జాబా? అక్కడ వారికి SAFETY AND SECURITY ఉంటుందా? ALMOST ALL యజమానులందరూ  పురుషులే కదా!
 
     ఇలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూపోతే -IT IS IMPOSSIBLE ,I  THINK. ఒకవేళ  అలా జరగాలంటే -అది జీవన ప్రక్రియనే ఆపేస్తుందేమో! THERE WILL BE STANDSTILL IN THE HUMAN LIFE.

     అంత పెద్ద రచయిత గారు  అలా QUOTE  చేయడం  సబబు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే-ఇక్కడ  ఎవరుబయట ఉండాలి ,ఎవరు  లోపల ఉండాలి  అనేది కాదు POINT.  స్త్రీలపై  పురుషుల  దృక్పధం మారాలి. స్త్రీలను  గౌరవించడం రావాలి. అది ఇంటి నుండే రావాలి. చిన్నతనము లోనే  అబ్బాయిలకు  FEMININE GENDER ఫైగౌరవ మర్యాదలు  ఉండేట్లు నేర్పాలి.GIRLS  అంటే ఆటవస్తువులు ,SEXY SYMBOLS  కాదని ,వారిని
గౌరవించటం,మర్యాదించడం  వారికి తెలియ చెప్పటం లాంటివి  ఇంటిలో నుండే మొదలవ్వాలి.అలాగనే  స్త్రీలు కూడా  ఇంట్లో  తమ కూతుర్లకి   మన సంస్కృతి, సాంప్రదాయాలని , వాటి గొప్ప తనాలని  చెబుతూ గౌరవాన్ని ఇనుమడింపజేసే , శరీరాన్ని COVER చేస్తూ ఉండే, మనకు సేఫ్టీ కలిగించే డ్రెస్ లను ధరించడం  మంచిదని వారికి నచ్చచెప్పటం  లాంటివి చేయాలి. బట్టలు హుందాగా ధరించటం (EVEN MODERN DRESSES) ఎలాగో వారికి తెలియ చెప్పాలి. ఎందుకంటే ,పంజాబీ డ్రెస్ వేసుకున్న చాలామంది అమ్మాయిలని OBSERVE  చేస్తే -వారికి చున్ని ఉంటుంది ,సంతోషమే ,కాని  అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండ గొంతుకు అతుక్కుని ఉంటుంది. అదే బాధ. ఇలా ప్రతి ఒక్కరు -ఎవెరి డ్యూటీ వారు చేస్తే  కొంతైన అత్యాచారాలను  అరికట్టవచ్చునెమో!

    ఇక ప్రభుత్వ పరంగా చూస్తె -RAPIST లకు త్వరగా శిక్ష పడేట్లు చూడాలి. అది ఏ  శిక్ష అయినను, అంటేమరణ శిక్ష గాని లేక జీవిత ఖైదు కాని. మరి మీరేమంటారు?